Rajasthan: భార్య కాళ్లను బైక్‌కు కట్టి ఈడ్చుకెళ్ళిన ప్రబుద్ధుడు

వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేసు నమోదు;

Update: 2024-08-14 03:00 GMT

రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లాలో జరిగిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ వ్యక్తి మద్యం మత్తులో భార్యను కొట్టి, ఆపై ఆమెను ద్విచక్రవాహనానికి కట్టేసి గ్రామంలో ఈడ్చుకెళ్లాడు. ఈ వీడియో వైరల్‌ కావడంతో నిందితుడిని అరెస్టు చేసినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు.

నాగౌర్‌కు చెందిన ప్రేమ్‌రామ్‌ మేఘ్‌వాల్‌ (32) భార్య జైసల్మేర్‌లో ఉంటున్న తన సోదరి ఇంటికి వెళ్లాలనుకుంది. భర్త దీనికి నిరాకరించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ప్రేమ్‌రామ్‌ మద్యం తాగి, భార్యపై దాడి చేశాడు. ఆమె కాళ్లను ద్విచక్రవాహనం వెనుక కట్టి గ్రామంలోని మట్టిరోడ్డుపై ఈడ్చుకొంటూ వెళ్లాడు. ఈ ఘటన గత నెల నహర్‌సింగ్‌పుర గ్రామంలో జరిగిందని, ఆ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చినట్లు పాంచౌడీ పోలీస్‌స్టేషను ఏఎస్‌ఐ సురేంద్రకుమార్‌ తెలిపారు. వీడియో ఆధారంగానే నిందితుడిని అరెస్టు చేశామన్నారు. బాధితురాలు ప్రస్తుతం తన బంధువుల ఇంట్లో ఉంటోందని, ఈ ఘటనపై ఆమె ఇంతవరకూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. 

  ఘటన‌లో స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. అయితే,  బాధితురాలిని  'కొనుగోలు' చేసి ఉండవచ్చు అని కూడా చెబుతున్నారు. భార్యను 'కొనుగోలు' చేసే భయంకరమైన ఆచారం రాజస్థాన్‌లోని ఝంఝున్, నాగౌర్, పాలి వంటి జిల్లాల్లో కొనసాగుతోంది. మహిళలను కొనుగోలు చేసి.. శారీరకంగా, మానసికంగా, లైంగికంగా వారిని చిత్రహింసలకు గురిచేస్తోస్తున్న సంఘటనలు ఇక్కడ  కోకొల్లులు. వారితో బలవంతంగా వ్యవసాయ, ఇంటి పనులు చేయించడం, తమ లైంగిక వాంఛలను తీర్చుకుని బానిసలుగా చూస్తారు.   

Tags:    

Similar News