కదులుతున్న బైక్‌పై పాము కాటుకు గురైన వ్యక్తి మృతి

పాములు పట్టే వాళ్లే పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయే సంఘటనలు తరచూ చూస్తుంటాము..;

Update: 2023-09-23 11:07 GMT

పాములు పట్టే వాళ్లే పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయే సంఘటనలు తరచూ చూస్తుంటాము.. మధ్యప్రదేశ్ ఇండోర్ లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో మోటర్‌బైక్‌పై వెళ్తుండగా నాగుపాము కాటుకు గురైన వ్యక్తి మరణించాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మృతుడు మనీష్ అనే వ్యక్తి పాములు పట్టేవాడు. మనీష్ తన రెండు చేతుల్లో పామును పట్టుకుని బైక్ వెనుక కూర్చున్నాడు. స్నేహితుడు బైక్ నడుపుతుండగా ఈ ఘటన జరిగింది.

పామును పట్టుకుని వస్తున్నారు. కానీ ఆ పామే అతడిని కాటేసింది. అతడి ప్రాణాలు పోవడానికి కారణమయ్యింది. బైక్ వెనుక కూర్చున్న మనీష్ ని పాము కాటు వేయడంతో కింద పడిపోయాడు. మళ్లీ లేవడానికి ప్రయత్నించాడు.. అయినా విషం శరీరం అంతా పాకడంతో పైకి లేచినా మళ్లీ పడిపోయాడు. చివరకు అతడు ప్రాణాలు కోల్పోయాడు. 

Tags:    

Similar News