Honeymoon Murder Case: హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్!
మేజిస్ట్రేట్ ముందు ప్లేట్ ఫిరాయించిన నిందితులు;
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసులో నిందితులు ప్లేట్ ఫిరాయించారు. రాజాను చంపిన ఐదుగురు నిందితుల్లో ఇద్దరు నేరాన్ని ఉపసంహరించుకున్నారు. మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా నేరాన్ని అంగీకరించలేదు. మౌనంగా ఉండిపోయారు. దీంతో మేఘాలయ పోలీసులు షాక్‌కు గురయ్యారు. అంతకముందు పోలీసుల విచారణలో రాజాను చంపినట్లుగా నేరాన్ని అంగీకరించారు. తీరా కోర్టులో హాజరపరచగా ప్లేట్ ఫిరాయించారు. అయితే తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయంటూ పోలీసులు చెబుతున్నారు.
ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ-యూపీకి చెందిన సోనమ్ రఘువంశీకి మే 11న వివాహం జరిగింది. మే 20న హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. మే 23న హంతక ముఠాతో కలిసి భార్య సోనమ్.. భర్తను చంపేసి లోయలో పడేసింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. తీరా చూస్తే నేరాన్ని అంగీకరించలేదు.
షిల్లాంగ్ నగర పోలీసు సూపరింటెండెంట్, హత్య కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి ఖార్కోంగోర్ మాట్లాడుతూ.. ఆకాష్ రాజ్‌పుత్, ఆనంద్ కుర్మి గురువారం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు మౌనంగా ఉన్నారని.. ఎటువంటి వ్యాఖ్యలు చేయడానికి నిరాకరించినట్లు తెలిపారు. ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని మాత్రమే మేజిస్ట్రేట్ ముందుకు తీసుకొచ్చినట్లు చెప్పారు. అయితే తమ దగ్గర అన్ని ఆధారాలున్నాయని.. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అయితే విచారణలో నిందితులంతా నేరాన్ని అంగీకరించారని.. కోర్టులో మాత్రం నిరాకరించారన్నారు. అయితే పోలీసుల వాదనను న్యాయస్థానం అంగీకరించలేదని తెలిపింది. ఇక నేరాన్ని ఒప్పుకోకపోవడం అనేది నిందితుల హక్కు అని.. అందుకే భౌతిక ఆధారాలు ప్రవేశపెడతామని చెప్పారు. దీంట్లో ఎలాంటి సమస్యలేదని. తగిన ఆధారాలు తమ దగ్గర ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు.
మే 11న రాజా-సోనమ్‌కు వివాహం జరిగింది. అయితే సోనమ్‌కు అప్పటికే ప్రియుడు రాజ్ కుష్వాహా ఉన్నాడు. పెళ్లయ్యాక కూడా రాజ్ కుష్వాహాతో సోనమ్ సంబంధాలు కొనసాగించింది. పెళ్లైన 3 రోజులకే ప్రియుడి దగ్గరకు వచ్చి.. భర్త రాజాను చంపేందుకు కుట్ర పన్నింది. మే 20న హనీమూన్ పేరుతో మేఘాలయకు తీసుకొచ్చి భర్తను చంపేసింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇక సోనమ్‌తో ఆమె కుటుంబ సభ్యులు బంధాలను తెంచుకున్నారు.