Active Monsoon Movement : చురుగ్గా రుతువపనాలు.. ఈసారి వానలు ముందే రాక

Update: 2025-05-21 09:00 GMT

దేశంలో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. నాలుగు రోజుల్లో కేరళలోకి ప్రవేశంచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ కర్ణాటక తీరానికి సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో తెలంగాణలో ఇవాళ రేపు వర్షాలు పడనున్నాయి. దీనికి తోడు కర్ణాటకలో భారీ వర్షాలు పడుతున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వానలకు తోడు కర్నూల్ ఏరియాలోనూ వానలు పడుతున్నాయి. దీంతో తుంగభద్ర, వేదవతి నదులకు జలకళ మొదలైంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కృష్ణ ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News