NCB ఆఫీస్‌కు చేరిన నటి రకుల్ ప్రీత్ సింగ్
బాలీవుడ్ డ్రగ్స్‌కేసు విచారణలో భాగంగా ముంబైలోని NCB ఆఫీస్‌కు నటి రకుల్ ప్రీత్ సింగ్ చేరుకుంది. నిన్ననే ఆమె విచారణక హాజరు కావాల్సి ఉన్నప్పటికీ...;
బాలీవుడ్ డ్రగ్స్‌కేసు విచారణలో భాగంగా ముంబైలోని NCB ఆఫీస్‌కు నటి రకుల్ ప్రీత్ సింగ్ చేరుకుంది. నిన్ననే ఆమె విచారణక హాజరు కావాల్సి ఉన్నప్పటికీ... సమన్లు అందలేదని మొదట చెప్పింది. ఆ తర్వాత.. ఆమె లీగల్ టీమ్... సమన్లు అందాయని తెలిపింది. ఆ తర్వాత నేడు విచారణకు హాజరవుతున్నట్టు రకుల్ స్పష్టం చేసింది. నేడు ఆమెతోపాటు దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌ను కూడా NCB అధికారులు విచారించనున్నారు. రేపు.. దీపికా పదుకునే, సారా అలీఖాన్, శ్రద్దా కపూర్‌లను NCB విచారించనుంది.
సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియాను విచారిస్తున్న క్రమంలో.. ఈ నలుగురు హీరోయిన్ల పేర్లు బయటికి వచ్చాయి. దీంతో వారందరికీ NCB అధికారులు సమన్లు జారీ చేశారు. మరోవైపు... రియాతోపాటు ఆమె సోదరుడిని జైల్లోనే విచారించేందుకు కోర్టు అనుమతించింది. రియా మరోసారి బెయిల్ పిటిషన్ పెట్టుకున్నప్పటికీ.. నిన్న ఎలాంటి విచారణ జరగలేదు. బెయిల్ పిటిషన్‌ను సెప్టెంబర్ 28కి వాయిదా వేసింది బాంబే హైకోర్టు.
బాలీవుడ్ టాప్ హీరోయిన్లకు NCB సమన్లు జారీ చేయడంతో... బీ టౌన్‌లో టెన్షన్ మొదలైంది. ఎప్పుడు ఎవరి పేర్లు బయటికొస్తాయోనని... బడా నటుల్లోనూ ఆందోళన మొదలైంది. ఇప్పటికే పలువురు స్టార్లు.. తమ లాయర్లతో ముందస్తు బెయిల్ వంటివి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం.