Ajit Pawar: ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు పూర్తి ..

లక్షలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు

Update: 2026-01-29 06:15 GMT

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందిన సంగతి తెలిసిందే. బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే, ఏపీ మంత్రి నారా లోకేశ్ తదితరులు హాజరయ్యారు. అంత్యక్రియలకు పెద్ద ఎత్తున ఎన్సీపీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. తమ అభిమాన నాయకుడిని తలచుకుని కార్యకర్తలు కన్నీటి పర్యంతం అయ్యారు. అంత్యక్రియలను ఎంపీ సుప్రియా సూలే దగ్గరుండి పర్యవేక్షించారు. అతిథులను ఆహ్వానించడం దగ్గర నుంచి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఆమెను చూసుకున్నారు.

నిన్న ఉదయం విమాన ప్రమాదం జరిగింది. రన్ వే పైకి దిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం బారామతికి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

అజిత్ పవార్ బ్యాగ్రౌండ్  ..

అజిత్ పవార్.. 22 జూలై 1952లో జన్మించారు. భార్య సునేత్ర పవార్. ఇద్దరు కొడుకులు పార్థ్ పవార్, జే పవార్ ఉన్నారు. ఏక్‌నాథ్ షిండే, ఫడ్నవిస్ ప్రభుత్వాల్లో ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఫడ్నవిస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. పృథ్వీరాజ్ చవాన్ , దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ థాక్రే, ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గాల్లో కూడా డిప్యూటీ సీఎంగా కొనసాగారు. మొత్తం ఆరుసార్లు ఈ పదవిలో ఉన్నారు. 2022 నుంచి 2023 వరకు మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. 1991లో బారామతి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. పీవీ.నరసింహారావు కేబినెట్‌లో రక్షణ మంత్రిగా కూడా పని చేశారు. బారామతి నియోజకవర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Tags:    

Similar News