Akasa Airlines : ఆకాశంలోకి "అకస" ఎయిర్‌లైన్స్

Akasa Airlines : అకస ఎయిర్‌లైన్స్‌కు డీజీసీఏ అనుమతినివ్వడంతో ఈ నెలాఖరులోగా సామాన్యలకు అందుబాటులోకి రానున్నాయి.

Update: 2022-07-07 14:30 GMT

Akasa Airlines : స్టాక్ మార్కెట్ లో రారాజుగా వెలుగుతున్న బిలియనేర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఎయిర్ లైన్స్ వ్యాపారంలో అడుగుపెట్టారు. తాజాగా ఆయన పెట్టుబడులు పెట్టి స్థాపించిన అకస ఎయిరలైన్స్‌కు డీజీసీఏ అనుమతినిచ్చింది. ఈ నెలాఖరులోగా అకస ఎయిర్‌లైన్స్ సేవలు సామాన్యులకు అందుబాటులోకి రానున్నాయి.

అకస ఎయిర్‌లైన్స్‌కు డీజీసీఏ అనుమతినివ్వడంతో అకస ఫౌండర్ సీఈవో వినెయ్ దూబె సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి కృతఘ్నతలు తెలిపారు. ఇప్పటికే అకస ఎయిర్‌‌లైన్స్ అన్ని పరీక్షలను ఎదుర్కొంది. పలుమార్లు ఆకాశంలో విజయవంతంగా చక్కర్లు కొట్టింది. అకస ఎయిర్‌లైన్స్‌కు ప్రస్తుతం రెండు 737 మ్యాక్స్ బోయింగ్ విమానాలు ఉన్నాయి. ఈ రెండింటితో ఈ నెలాఖరులోగా కమర్షియల్ సర్వీసులు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు వినయ్ దూబె.

పర్యావరణానికి అనుగుణంగా, తక్కువ ధరలో, సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా సేవలందిస్తామని అకస ఎయిర్‌లైన్స్ స్థాపకులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్నో ఎయిర్‌లైన్స్ సేవలు అందుబాటులో ఉన్నా అతి తక్కువ ధరలోకి తీసుకురావడం ఒక ఛాలెంజ్ అని చెప్పుకోవచ్చు. అకస ఫౌండర్ వినయ్ దూబే చెబుతున్నట్లు తక్కువ ధరలో అందుబాటులోకి వస్తుందో లేదో చూడాల్సిందే.

Tags:    

Similar News