అంబానీ ఇంటికి కొత్త వారసురాలు
ముకేశ్ పెద్ద కుమారుడు అకాశ్ అంబానీ, కోడలు శ్లోకా అంబానీ దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు;
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఇంటికి వారసురాలు వచ్చింది. ముకేశ్ పెద్ద కుమారుడు అకాశ్ అంబానీ, కోడలు శ్లోకా అంబానీ దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. శ్లోకా అంబానీ పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చారు. అంబానీ ఇంటికి వారసురాలు రావడడంతో ఆ ఇంట సంతోషం నెలకొంది. 2019లో వీరికి వివాహం జరిగింది. 2020 డిసెంబర్‌లో ఈ జంట తొలి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం కుమారుడికి రెండేళ్లు. ముంబయి ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవంలో బేబీ బంప్‌తో శ్లోకా కనిపించారు. వారం క్రితం ముంబయిలోని కుటుంబ సభ్యులతో కలిసి సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఆకాశ్ అంబానీ రిలయన్స్ జియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.