Akshay Kumar: అయోధ్యలో వానరాల కోసం అక్షయ్‌కుమార్ కోటి విరాళం
భక్తులకు ఇబ్బంది కలగకుండా... 1200 కోతులకు పౌష్ఠికాహారం;
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఉదారతను చాటుకున్నాడు. దీపావళి కానుకగా అయోధ్యలోని వానరసేనకు రూ.1 కోటి విరాళం ప్రకటించాడు. అయోధ్య రామాలయానికి వచ్చే భక్తులను వానరసేన ఇబ్బంది పెట్టకుండా... అలాగే ఆకలితో ఉన్న వానరసేనకు ఆహారం కోసం ఈ మొత్తాన్ని ఇస్తున్నాడు. అందుకోసం ప్రత్యేకంగా ఫీడింగ్ వ్యాన్‌ను కూడా పంపించాడు.
అయోధ్య వానరసేనకు అక్షయ్ కుమార్ ఆహారం పెట్టడం ఇదే మొదటిసారి కాదు. బాలరాముడి ఆలయ ప్రారంభం అయినప్పటి నుంచి అయోధ్య శివారులోని సురక్షిత ప్రాంతంలో దాదాపు 1,200 కోతులకు నిత్యం పౌష్ఠికాహారం అందిస్తున్నాడు.అయోధ్య నగరంలో వానరాల పోషణ నిమిత్తం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ‘ఆంజనేయ సేవా ట్రస్ట్’ వారికి ఈ విరాళాన్ని అందజేయనున్నట్టు అక్షయ్‌కుమార్ తెలిపారు.
అయోధ్యలో ఆహారం కోసం కోతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలిసినప్పుడు తనకు బాధగా అనిపించిందని, వాటి కోసం తన వంతు కృషి చేయాలనుకుంటున్నానని అక్షయ్ కుమార్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. దీపావళి సందర్భంగా తన తల్లిదండ్రులకు తన మామ, బాలీవుడ్ వెటరన్ నటుడు రాజేశ్ ఖన్నాలకు అంకితం చేస్తున్నానని అక్షయ్‌కుమార్ తెలిపారు.