KHAMENI: మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్ వరకు

మధ్యప్రాచ్యంలో ముగిసిన ఖమేనీ శకం... 36 ఏళ్ల పాటు ఇరాన్‌‌‌ను ఏలిన సుల్తాన్... అత్యంత శక్తివంతమైన నేతగా గుర్తింపు

Update: 2026-03-02 04:02 GMT

మధ్య­ప్రా­చ్య రా­జ­కీ­యా­ల్లో కీలక మలు­పు తి­రి­గే పరి­ణా­మం­గా ఇరా­న్ సు­ప్రీం లీ­డ­ర్ అయ­తు­ల్లా అలీ ఖమే­నీ మరణం ని­లి­చిం­ది. దా­దా­పు మూడు దశా­బ్దా­ల­కు­పై­గా ఇరా­న్ రా­జ­కీయ, మత, సై­నిక వ్య­వ­స్థ­ల­పై ఏకైక ఆధి­ప­త్యా­న్ని కొ­న­సా­గిం­చిన నా­య­కు­డి మృతి ప్రాం­తీయ సమీ­క­ర­ణా­ల­ను మా­త్ర­మే కాక, ప్ర­పంచ శక్తి­సా­మ్యా­ల­ను కూడా ప్ర­భా­వి­తం చేసే అవ­కా­శ­ముం­ది. ఆయన మరణం నే­ప­థ్యం­లో ఇరా­న్‌­లో అం­త­ర్గ­తం­గా అధి­కార వా­ర­స­త్వం­పై చర్చ­లు వే­డె­క్కు­తు­న్నా­యి. అదే సమ­యం­లో పశ్చి­మా­సి­యా­లో భవి­ష్య­త్తు ఉద్రి­క్త­త­ల­పై అం­త­ర్జా­తీయ సమా­జం దృ­ష్టి సా­రిం­చిం­ది.

 36 ఏళ్లపాటు ఏకఛత్రాధిపత్యం

అలీ ఖమే­నీ 1939 ఏప్రి­ల్ 19న ఇరా­న్‌­లో­ని పవి­త్ర నగరం మషా­ద్లో జన్మిం­చా­రు. మత­ప­ర­మైన కు­టుం­బం­లో పు­ట్టిన ఆయన తం­డ్రి జా­వ­ద్ ఖమే­నీ ప్ర­ముఖ ఇస్లా­మి­క్ పం­డి­తు­డు. బా­ల్యం­లో­నే మత­పా­ఠా­లు అభ్య­సిం­చిన ఖమే­నీ, తరు­వాత ఉన్నత వి­ద్య కోసం ఓమో­కు వె­ళ్లా­రు. అక్కడ ఆయన ఇస్లా­మి­క్ సి­ద్ధాం­తా­ల­పై లో­తైన అధ్య­య­నం చేసి, తరు­వా­తి రా­జ­కీయ జీ­వి­తం కోసం బల­మైన ఆలో­చ­నా పు­నా­ది వే­సు­కు­న్నా­రు. 1960లలో ఇరా­న్‌­లో పహ్లా­వీ రా­జ­రి­కా­ని­కి వ్య­తి­రే­కం­గా ఉద్య­మా­లు ము­మ్మ­ర­మైన సమ­యం­లో ఖమే­నీ, అప్ప­టి మత­ప్ర­ము­ఖు­డు ఖమే­నీ ప్ర­భా­వం­తో వి­ప్లవ కా­ర్య­క­లా­పా­ల్లో చు­రు­కు­గా పా­ల్గొ­న్నా­రు. రా­జ­రిక వ్య­తి­రేక కా­ర్య­క­లా­పాల కా­ర­ణం­గా పలు­మా­ర్లు జై­లు­శి­క్ష అను­భ­విం­చా­రు. ఈ కా­ల­మే ఆయ­న­ను కఠిన వై­ఖ­రి­కి, మత­ప­ర­మైన రా­జ­కీ­యాల వైపు మలి­చిం­ది. 1979లో ఇస్లా­మి­క్ వి­ప్ల­వం వి­జ­య­వం­త­మైన తరు­వాత ఖమే­నీ­కి కీలక బా­ధ్య­త­లు అప్ప­గిం­చ­బ­డ్డా­యి. రి­వ­ల్యూ­ష­న­రీ కౌ­న్సి­ల్ సభ్యు­డి­గా, డి­ప్యూ­టీ రక్షణ మం­త్రి­గా ఆయన కీలక పా­త్ర పో­షిం­చా­రు. 1981లో ఇరా­న్-ఇరా­క్ యు­ద్ధ సమ­యం­లో దేశ అధ్య­క్షు­డి­గా ఎన్ని­క­య్యా­రు. ఈ పద­వి­ని చే­ప­ట్టిన తొలి మత గు­రు­వు­గా ఆయన చరి­త్ర సృ­ష్టిం­చా­రు. రెం­డు సా­ర్లు అధ్య­క్షు­డి­గా సే­వ­లం­దిం­చారు.

సుప్రీం లీడర్‌గా పూర్తి ఆధిపత్యం

సు­ప్రీం లీ­డ­ర్‌­గా బా­ధ్య­త­లు స్వీ­క­రిం­చిన తరు­వాత ఖమే­నీ ఇరా­న్ పా­ల­నా వ్య­వ­స్థ­లో మత గు­రు­వుల ఆధి­ప­త్యా­న్ని మరింత బలో­పే­తం చే­శా­రు. దేశ సై­న్యం, న్యా­య­వ్య­వ­స్థ, మీ­డి­యా, కీలక ని­యా­మ­కా­లు అన్నీ ఆయన ని­యం­త్ర­ణ­లో­నే ఉం­డే­వి. ము­ఖ్యం­గా ఐఆ­ర్‌­జీ­సీ­కు అపార అధి­కా­రా­లు కట్ట­బె­ట్టి, దే­శీయ–వి­దే­శాంగ వి­ధా­నా­ల్లో ప్ర­ధాన శక్తి­గా తీ­ర్చి­ది­ద్దా­రు. ఇరా­న్ బా­లి­స్టి­క్ మి­స్సై­ల్ కా­ర్య­క్ర­మం కూడా ఐఆ­ర్‌­జీ­సీ ఆధ్వ­ర్యం­లో­నే నడి­చిం­ది. ప్ర­పం­చ­వ్యా­ప్తం­గా షియా ము­స్లిం­ల­కు నా­య­కు­డి­గా ఎది­గిన ఖమే­నీ, పా­ల­స్తీ­నా అం­శం­పై కఠిన వై­ఖ­రి తీ­సు­కో­వ­డం ద్వా­రా సు­న్నీ ము­స్లిం­ల­లో­నూ ప్రా­ధా­న్యత సం­పా­దిం­చా­రు. అమె­రి­కా, ఇజ్రా­యె­ల్‌­పై తీ­వ్ర వి­మ­ర్శ­లు చే­య­డం ఆయన రా­జ­కీయ ధో­ర­ణి­లో ము­ఖ్యాం­శం.

 అంతర్గత సవాళ్లు

ఖమే­నీ పా­ల­న­లో ఇరా­న్ సై­ని­కం­గా, వ్యూ­హా­త్మ­కం­గా బల­ప­డి­న­ప్ప­టి­కీ, అం­త­ర్గత అసం­తృ­ప్తి పె­రు­గు­తూ వచ్చిం­ది. 2009లో అధ్య­క్ష ఎన్ని­కల రి­గ్గిం­గ్ ఆరో­ప­ణ­ల­తో ని­ర­స­న­లు చె­ల­రే­గా­యి. 2017, 2019లో ఆర్థిక ఆం­క్షల ప్ర­భా­వం­తో ధర పె­ర­గ­డం­తో ప్ర­జ­లు వీ­ధు­ల్లో­కి వచ్చా­రు. 2022లో యు­వ­తి మరణం నే­ప­థ్యం­లో హి­జా­బ్ వ్య­తి­రేక ఉద్య­మా­లు అల్ల­ర్ల­కు దా­రి­తీ­శా­యి. ఈ ని­ర­స­న­ల­ను అణ­చి­వే­సే క్ర­మం­లో వం­ద­లా­ది మంది ప్రా­ణా­లు కో­ల్పో­యా­రు. అం­త­ర్జా­తీ­యం­గా కూడా ఇరా­న్‌­పై ఆం­క్ష­లు, అణు కా­ర్య­క్ర­మం­పై వి­వా­దా­లు కొ­న­సా­గా­యి. ని­యం­తృ­త్వ పాలన నుం­చి వి­ము­క్తి కో­రు­తూ కొం­త­మం­ది ఇరా­న్ వా­సు­లు అమె­రి­కా మాజీ అధ్య­క్షు­డు ట్రం­ప్ను ఆశ్ర­యిం­చిన సం­ద­ర్భా­లు కూడా వె­లు­గు­లో­కి వచ్చా­యి.ఇరా­న్ రా­జ­కీ­యా­ల­పై అచం­చల ము­ద్ర వే­సిన ఖమే­నీ మృతి, ఒక యు­గా­ని­కి ము­గిం­పు పలి­కిం­ది.

Tags:    

Similar News