Supreme Court: సుప్రీం న్యాయమూర్తుల సంచలన నిర్ణయం.. ఆస్తుల ప్రకటన
వెబ్‌సైట్‌లో ఆస్తుల వివరాలు;
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇవాళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ వ్యక్తిగత ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు నిర్ణయించారు. పారదర్శకతతో పాటు ప్రజల్లో న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని నింపేందుకు ఈ చర్యకు పూనుకున్నారు. డిక్లరేషన్ ద్వారా ఆస్తులు వివరాలను వెల్లడించేందుకు న్యాయమూర్తులు ఏకగ్రీవంగా అంగీకరించారు.
ఏప్రిల్ ఒకటో తేదీన జరిగిన ఫుల్ కోర్టు మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత ప్రధాన న్యాయమూర్తికి తమ ఆస్తులు వివరాలను వెల్లడించేందుకు జడ్జీలు నిర్ణయించారు. సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో ఆస్తుల వివరాలను అప్‌లోడ్ చేయనున్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జీ జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో డబ్బు దొరికిన అంశం వివాదాస్పదం కావడంతో సుప్రీం న్యాయమూర్తులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.
అసెట్స్‌ను డిక్లేర్ చేసే విధివిధానాలను త్వరలో ఖరారు చేయనున్నారు. వాస్తవానికి ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న అందరు జడ్జీలు తమ ఆస్తుల వివరాలను డిక్లేర్ చేశారు. కానీ ఆ వివరాలను పబ్లిక్‌గా రిలీజ్ చేయలేదు.