9 రోజుల ముందే అమర్‌నాథ్ యాత్ర ముగింపు
ఈనెల 23నుంచి తాత్కాలికంగా విరామమిచ్చిన అమర్‌నాథ్ ట్రస్ట్;
అమర్ నాథ్ యాత్ర తొమ్మిది రోజుల ముందే ముగియనుంది. గత నెల 1 న ప్రారంభమైన యాత్ర.. 62 రోజు పాటు కొనసాగాల్సి ఉండగ.. ఈనెల 23 నుంచి తాత్కాలికంగా విరామమిస్తున్నట్లు అమర్‌నాథ్ ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. అమర్‌నాథ్ యాత్రకు ఉన్న రెండు ప్రధాన మార్గాల్లో మరమ్మత్తుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 31న జరగనున్న శివదండం ఊరేగింపు కార్యక్రమం పహల్గామ్ మార్గంలో యథావిధిగా కొనసాగుతుంది. యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 4.4 లక్షల మంది భక్తులు అమర్నాథుడుని దర్శించుకున్నారు.
జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు 62 రోజుల పాటు అమర్‌నాథ్ యాత్రకు కేంద్రం ఏర్పాటు చేసింది. దక్షిణ కశ్మీర్లోని హిమాలయ పర్వతాల్లో, భూమికి 3,880 మీటర్ల ఎత్తులో అమర్నాథ్ఆలయం ఉంది. గుహలోని శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు దేశ నలుమూల నుంచి తరలివెళ్తుంటారు. అనంతనాగ్జిల్లా పహల్గామ్, గండర్బాల్ జిల్లా బల్టాల్మార్గాల్లో 2023 అమర్నాథ్యాత్ర కొనసాగింది.