మోదీపై మండిపడుతున్న మణిపూర్ ప్రజలు
ఈ నెల 24 న అఖిలపక్షం అఖిల పక్షానికి పిలిపునిచ్చిన హోం మంత్రి;
రెండు జాతుల మధ్య చెలరేగిన హింసతో మణిపూర్ అట్టుడికి పోతోంది. ఇప్పటికే వందమందికిపైగా ప్రాణాలు కోల్పోగా, . భారీ ఆస్తి నష్టం సంభవించింది. వేలాది ఇళ్లు, ఆస్తులు, వాహనాలు ధ్వంసమయ్యాయి. మోదీ ప్రభుత్వం సైతం ఆ రాష్ట్రంలో పరిస్థితులను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైన విమర్శల నేపథ్యంలో మణిపూర్ పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 24న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.
దాదాపు 50 రోజులుగా మణిపూర్ మండిపోతుంటే, ప్రధానిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మోదీ మౌనం వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మణిపూర్ వాసుల్లో సైతం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారిని రోడ్లపైకి వచ్చేలా చేసింది. బుధవారం యోగా డేను బహిష్కరిస్తూ, తౌబాల్ మేలా మైదానంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. వేలాది సంఖ్యలో మణిపూర్ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షోభానికి పరిష్కారం చూపని కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రధాని మోదీతో పాటు అమిత్‌షా, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ 50 రోజులలో రెండుసార్లు నిర్వహించిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ మణిపూర్ గురించి మాట్లాడకపోవడంపై నిరసనకారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.మోదీ మౌనంపై విపక్షాలు కూడా మండిపడుతున్నాయి. రాష్ట్రంలో శాంతి నెలకొనాలని కోరుకుంటూ కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
క్రమంలోనే ఆ రాష్ట్రానికి చెందిన అధికార బీజేపీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. వీరంతా మెయితీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు. మణిపూర్‌లోని బీరేన్ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు విశ్వాసం పూర్తిగా కోల్పోయారని ఎమ్మెల్యేలు లేఖలో పేర్కొన్నారు. ఐదు అంశాలపై ప్రధాని మోదీకి మెమోరాండం అందించారు. అటు మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ వర్గానికి చెందిన 28 మంది బీజేపీ ఎమ్మెల్యేలు.. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి మెమోరాండం సమర్పించారు. సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్ కింద కుకీ మిలిటెంట్ గ్రూపులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇదంతా ఇలా జరుగుతుండగానే,
రాష్ర్టానికి చెందిన విద్యార్థులు పక్క రాష్ట్రలకు వెళ్లిపోతున్నారు. తాజాగా 1500 మందికి పైగా విద్యార్థులు పొరుగున ఉన్న మిజోరం రాష్ట్రంలోని పాఠశాలల్లో చేరారు. వీరందరికీ ఉచితంగా అడ్మిషన్లు ఇచ్చినట్టు మిజోరం విద్యాశాఖ డైరెక్టర్ లాల్సాగ్లింయానా తెలిపారు.