Amit Shah: తెలంగాణలో త్వరలో బీజేపీ భారీ బహిరంగ సభ.. అందుకేనా?
Amit Shah: టీఆర్‌ఎస్‌పై ముప్పేట దాడి చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు.;
Amit Shah (tv5news.in)
Amit Shah: టీఆర్‌ఎస్‌పై ముప్పేట దాడి చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ సమావేశాలు ముగిశాక తెలంగాణలో అమిత్ షా రెండు రోజులు పర్యటించనున్నారు. పెరేడ్ గ్రౌండ్స్ లేదా మరోచోట బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.
తెలంగాణలో దుబ్బాక, హుజురాబాద్ లాంటి ఫలితాలే భవిష్యత్‌లో రావాలని.. ఆ దిశగా కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్లాలని అమిత్ షా స్పష్టం చేశారు. తెలంగాణలో తదుపరి ఏ ఎన్నిక వచ్చినా.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ గెలిచేలా పకడ్బందీ ప్రణాళిక, వ్యూహంతో ముందుకు వెళ్లాలన్నారు. అటు.. పార్టీలోకి రావాలనుకుంటున్నవారి వివరాలు ఎప్పటికప్పుడు అధిష్టానానికి అందించాలని అమిత్ షా సూచించారు.