Amit Shah : కశ్మీర్ పర్యటనలో అమిత్‌షా సంచలన వ్యాఖ్యలు..

Amit Shah : జమ్ముకశ్మీర్‌ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు;

Update: 2022-10-04 16:11 GMT

Amit Shah : జమ్ముకశ్మీర్‌ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. గుజ్జర్లు, బకర్వాల్‌తో పాటు పహారీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. త్వరలో విద్య, ఉద్యోగాల్లో వారికి రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.

కోటా ప్రయోజనాలు పరిశీలించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ ఏర్పాటు చేసిన జస్టిస్ శర్మ కమిషన్ సిఫారసులు మేరకు రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలిపారు. ఎస్టీ కోటాలో గుజ్జర్లు, బకర్వాల్‌, పహారీలకు నష్టం జరగదన్నారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తి కాగానే ఆయా వర్గాల ప్రజలు రిజర్వేషన్‌ ప్రయోజనాలు పొందతారని అమిత్ షా స్పష్టంచేశారు.

అటు విపక్షాలపైనా అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో జమ్మూకశ్మీర్‌ను కేవలం మూడు రాజకీయ కుటుంబాలే పాలించాయని, అభివృద్ధి పేరుతో కేంద్ర నిధులను దోచుకున్నారని ఫైర్ అయ్యారు. మోదీ తీసుకున్న పటిష్ట చర్యల వల్లే జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆగడాలకు బ్రేకులు పడుతున్నాయన్నారు. జమ్మకశ్మీర్‌ అభివృద్ధికి ప్రధాని మోదీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అమిత్ షా తెలిపారు.

Tags:    

Similar News