Amit Shah: విచారణలో భాగంగా నన్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు: అమిత్ షా
Amit Shah: గుజరాత్ అల్లర్లపై విపక్షాలు చేసిందంతా విష ప్రచారమే అని సుప్రీంకోర్టు తీర్పుతో తేలిపోయిందని అమిత్ షా అన్నారు;
Amit Shah: గుజరాత్ అల్లర్లపై విపక్షాలు చేసిందంతా విష ప్రచారమే అని సుప్రీంకోర్టు తీర్పుతో తేలిపోయిందని హోం మంత్రి అమిత్ షా అన్నారు. ANI కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో షా అనేక అంశాలపై స్పందించారు. ప్రత్యర్థి పార్టీలు, కొంత మంది జర్నలిస్టులు, కొన్ని సంస్థలు కలిసి చేసిన ఈ విష ప్రచారం నుంచి మోదీ కడిగిన ముత్యంలా బయటకు వచ్చారని అన్నారు. అత్యున్నత పదవిలో ఉండి కూడా మోదీ.. విచారణకు సహకరించిన తీరు రాజ్యాంగాన్ని ఎలా గౌరవించాలనే దానికి ఆదర్శవంతమైన ఉదాహరణ అని అమిత్‌షా కొనియాడారు. విచారణ సమయంలో తనపై కూడా కేసులు పెట్టారని అరెస్టు కూడా చేశారని.. కానీ ఎక్కడా ఆందోళనలు జరగలేదని అమిత్ షా గుర్తు చేశారు