Murder Case: జన్‌సురాజ్ కార్యకర్త హత్యకేసు.. జేడీయూ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
బీహార్ ఎన్నికల్లో హత్యా రాజకీయాలు..
బీహార్ ఎన్నికల ముందు హత్యా రాజకీయాలు సంచలనంగా మారాయి. గురువారం, ప్రశాంత్ కిషోర్‌కు చెందిన జన్ సురాజ్ పార్టీ కార్యకర్త దులార్ చంద్ యాదవ్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఆదివారం తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే, మోకామా నుంచి పోటీ చేస్తున్న జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
పాట్నా ఎస్‌ఎస్‌పి నేతృత్వంలోని పోలీసులు బార్‌లోని సింగ్ నివాసానికి చేరుకుని, తరువాత అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల మోకామాలో తన మద్దతుదారులతో ఘర్షణకు దిగిన దులార్ చంద్ యాదవ్‌ను హత్య చేశారు. హత్య జరిగినప్పటి నుండి సింగ్‌ను నిఘాలో ఉంచారు. విచారణ కోసం అతన్ని పాట్నాకు తీసుకువచ్చారు. ఈ సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న మణికాంత్ ఠాకూర్, రంజీత్ రామ్ అనే ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు అరెస్టయిన ముగ్గురిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ హత్య జరిగింది. తుపాకీతో కాల్చి చంపినట్లు పోస్టుమార్టంలో తేలింది. దులాయ్ సింగ్ యాదవ్ హత్యకు సంబంధించిన పోలీసులు అనంత్ సింగ్, మణికాంత్ ఠాకూర్, రంజీత్ రామ్‌లను అరెస్ట్ చేసినట్లు ఎస్ఎస్పీ కార్తికేయ శర్మ చెప్పారు. ఇరు పార్టీల మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టును జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి పియూష్ ప్రియదర్శి స్వాగతించారు. మోకామా సీటు నుంచి అనంత్ సింగ్ భార్య నీలం ప్రస్తుతం పోటీలో ఉన్నారు. అయితే, ఈ దాడి మోకామా నుంచి పోటీ చేస్తున్న ఆర్జేడీ అభ్యర్థి వీణా దేవి భర్త, మాజీ ఎంపీ సూరజ్ భన్ సింగ్ చేసిన కుట్ర అని అనంత్ సింగ్ ఆరోపించారు.