ARATTAI: స్వదేశీ యాప్ అరట్టైకు సుప్రీంకోర్టు ప్రశంస

వాట్సప్‌ లేకపోతే ‘అరట్టై’ వాడండి: సుప్రీంకోర్టు... మేక్‌ ఇన్‌ ఇండియాను ప్రోత్సహిస్తూ కోర్టు దేశీయ యాప్‌ను ప్రస్తావించిందని ఆసక్తికర వ్యాఖ్యలు

Update: 2025-10-12 05:30 GMT

వా­ట్స­ప్‌ (WhatsApp)కు పో­టీ­గా దే­శీయ సం­స్థ జోహో అభి­వృ­ద్ధి చే­సిన స్వ­దే­శీ మె­సే­జిం­గ్‌ యా­ప్‌ 'అ­ర­ట్టై (Arattai)' పేరు ఇప్పు­డు దేశ అత్యు­న్నత న్యా­య­స్థా­నం సు­ప్రీం­కో­ర్టు­లో­నూ ప్ర­స్తా­వ­న­కు వచ్చిం­ది. వా­ట్స­ప్‌ ఖాతా పు­న­రు­ద్ధ­ర­ణ­కు సం­బం­ధిం­చి దా­ఖ­లైన ఓ రి­ట్‌ పి­టి­ష­న్‌­పై వి­చా­రణ సం­ద­ర్భం­గా ధర్మా­స­నం చే­సిన వ్యా­ఖ్య­లు చర్చ­నీ­యాం­శ­మ­య్యా­యి. "వా­ట్స­ప్‌ లే­క­పో­తే ఏం... కమ్యూ­ని­కే­ష­న్‌ కోసం ఇతర యా­ప్‌­లు ఉన్నా­యి కదా! ఈ మధ్యే స్వ­దే­శీ యా­ప్‌ ‘అర­ట్టై’ కూడా వచ్చిం­ది. దా­న్ని వా­డు­కోం­డి. " అని ధర్మా­స­నం సూ­చిం­చిం­ది.

 'ప్రాథమిక హక్కు ఎలా అవుతుంది?' అని ప్రశ్న:

తన ఖా­తా­ను వా­ట్స­ప్‌ అకా­ర­ణం­గా బ్లా­క్‌ చే­సిం­ద­ని, దా­న్ని పు­న­రు­ద్ధ­రిం­చే­లా ఆదే­శా­లి­వ్వా­ల­ని కో­రు­తూ ఒక పి­టి­ష­న­ర్‌ సు­ప్రీం­కో­ర్టు­లో రి­ట్‌ పి­టి­ష­న్‌ దా­ఖ­లు చే­శా­రు. సా­మా­జిక మా­ధ్య­మా­లు ఇలా ఖా­తా­ల­ను ఉన్న­ట్టుం­డి ని­షే­ధిం­చ­కుం­డా ఉం­డే­లా మా­ర్గ­ద­ర్శ­కా­లు జారీ చే­యా­ల­ని కూడా ఆయన న్యా­య­స్థా­నా­న్ని కో­రా­రు. దీ­ని­పై సు­ప్రీం­కో­ర్టు ధర్మా­స­నం ఒకింత అస­హ­నం వ్య­క్తం­చే­సిం­ది. ఆర్టి­క­ల్‌ 32 కింద ఈ పి­టి­ష­న్‌ ఎం­దు­కు వే­శా­ర­ని, వా­ట్స­ప్‌ యా­క్సె­స్‌ ఉం­డ­టం ప్రా­థ­మిక హక్కు ఎలా అవు­తుం­ది? అని ప్ర­శ్నిం­చిం­ది.

 'మేక్‌ ఇన్‌ ఇండియా'ను ప్రోత్సహిస్తూ..

పిటిషనర్‌ తరఫు న్యాయవాది బదులిస్తూ.. "పిటిషనర్‌ ఓ పాలీ డయాగ్నిక్‌ సెంటర్‌లో పనిచేస్తున్నారు. గత 10-12 ఏళ్లుగా వాట్సప్‌లోనే తన క్లయింట్‌లతో టచ్‌లో ఉన్నారు. ఉన్నట్టుండి ఆ ఖాతాను బ్లాక్‌ చేశారు" అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు దీ­ని­పై స్పం­దిం­చిన ధర్మా­స­నం.. ఇతర ప్ర­త్యా­మ్నాయ యా­ప్‌­ల­ను ఉప­యో­గిం­చ­వ­చ్చ­ని, ము­ఖ్యం­గా దే­శీయ యా­ప్‌ అయిన 'అ­ర­ట్టై­'­ని వా­డు­కో­వా­ల­ని సూ­చిం­చిం­ది. ఈ పి­టి­ష­న్‌ హై­కో­ర్టు­లో కూడా వి­చా­ర­ణ­కు అర్హ­మైం­ది కా­ద­ని వ్యా­ఖ్యా­నిం­చిం­ది. దీ­ని­పై ఉత్త­ర్వు­లు ఇచ్చేం­దు­కు ని­రా­క­రి­స్తూ పి­టి­ష­న్‌­ను తి­ర­స్క­రిం­చిం­ది. అనం­త­రం, కో­ర్టు అను­మ­తి­తో పి­టి­ష­న­ర్‌ తన వ్యా­జ్యా­న్ని ఉప­సం­హ­రిం­చు­కు­న్నా­రు.

అరట్టై ప్రత్యేకతలు, ప్రజాదరణ:

సు­ప్రీం­కో­ర్టు ప్ర­స్తా­విం­చిన అర­ట్టై యా­ప్‌­ను దే­శీయ సం­స్థ జోహో అభి­వృ­ద్ధి చే­సిం­ది. తమి­ళం­లో 'అ­ర­ట్టై' అంటే 'పి­చ్చా­పా­టీ సం­భా­ష­ణ' అని అర్థం. ఈ యా­ప్‌ ఇప్ప­టి­కే కోటి మం­ది­కి పైగా వి­ని­యో­గ­దా­రు­ల­ను కలి­గి ఉంది, వి­ప­రీ­త­మైన ప్ర­జా­ద­రణ లభి­స్తోం­ది. క్లీ­న్‌ ఇం­ట­ర్ఫే­స్‌, పలు ఫీ­చ­ర్లు, గో­ప్యత మీద దృ­ష్టి పె­ట్ట­డం వంటి వా­టి­తో ఇది మంచి ప్ర­త్యా­మ్నాయ వే­ది­క­గా పేరు తె­చ్చు­కుం­టోం­ది. ఈ యాప్‌ ద్వారా మెసేజ్‌లు, వాయిస్‌, వీడియో కాల్స్‌ చేసుకోవచ్చు. మీటింగుల్లో పాల్గొనటానికి, స్టోరీలు, ఫొటోలు, డాక్యుమెంట్స్‌ షేర్‌ చేసుకోవడానికి వీలుంది. పాకెట్స్‌ అనేది అరట్టై ప్రత్యేకత. మనకు కావాల్సిన ముఖ్యమైన సమాచారాన్ని ఇందులో సులభంగా స్టోర్‌ చేసుకోవచ్చు. త్వరలో చాట్స్‌కు కూడా ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ తీసుకొస్తామని జోహో వ్యవస్థాపకులు శ్రీధర్‌ వెంబు వెల్లడించారు. స్వదేశీ యాప్‌ను ప్రోత్సహించాలంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు సాంకేతిక రంగంలో 'మేక్‌ ఇన్‌ ఇండియా' స్ఫూర్తిని పెంచే విధంగా ఉన్నాయి.

Tags:    

Similar News