జమ్ము కశ్మీర్ లోని బందిపూర్ జిల్లాలో ఆర్మీ ట్రక్ ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి లోయలో పడిపోవడంతో నలుగురు జవాన్లు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ఆర్మీ సంతాపం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సహా పలువురు నేతలు విచారం వ్యక్తం చేశారు. అమరవీరులకు హృదయపూర్వక నివాళులర్పిస్తున్నానని, గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. కాగా గత ఏడాది డిసెంబర్ 24న కూడా ఓ ఆర్మీ వాహనం లోయలో పడిపోవడంతో ఐదుగురు సైనికులు చనిపోయిన విషయం తెలిసిందే.