Gujarat: గుజరాత్‌పై ఫోకస్ పెట్టిన ఆమ్‌ఆద్మీ పార్టీ.. వచ్చే ఎన్నికలే టార్గెట్..
Gujarat: వచ్చే ఏడాది గుజరాత్‌లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది ఆమ్ ఆద్మీ.;
Gujarat: ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్‌పై ఫోకస్ పెట్టింది. వచ్చే ఏడాది గుజరాత్‌లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్.. ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల్లో సత్తా చాటి ఫుల్ జోష్‌లో దూసుకుపోతుంది.
ఇక ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌పై గురిపెట్టారు అరవింద్ కేజ్రీవాల్. ఆ రాష్ట్రంలో పర్యటించిన ఆయన.. అక్కడ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు ఒక్క అవకాశం ఇస్తే.. గుజరాత్‌లో స్కూళ్లను మెరుగుపరుస్తామన్నారు. అలా జరగకపోతే తమను తరిమికొట్టండి అంటూ వ్యాఖ్యలు చేశారు. బరూచ్‌లోని సభ నిర్వహించిన ఆయన.. పాఠశాలల పరిస్థితి నిజంగా అధ్వానంగా ఉందని విమర్శించారు.
గుజరాత్‌లో ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయని.. కొన్ని శిథిలావస్థలో ఉన్నాయన్నారు. లక్షలాది మంది చిన్నారుల భవిష్యత్తు చిన్నాభిన్నమైపోయిందన్నారు. తమకు అధికారమిస్తే.. ఢిల్లీలో పాఠశాలలు మార్చినట్టుగా గుజరాత్‌లో కూడా మార్చగలమని అని కేజ్రీవాల్ అన్నారు.