Assam : అస్సాం సివిల్‌ సర్వీస్ అధికారిణి నుపుర్‌ బోరా అరెస్టు

Update: 2025-09-16 09:50 GMT

అస్సాం సివిల్ సర్వీస్ అధికారిణి నుపుర్ బోరాను ముఖ్యమంత్రి ప్రత్యేక విజిలెన్స్ సెల్ అధికారులు అరెస్టు చేశారు. ఆమె ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టుకున్నారనే ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నారు. నుపుర్ బోరా ఇంట్లో పోలీసులు దాదాపు రూ. 1.7 కోట్ల నగదు, అలాగే లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆమె బార్పేటలో సర్కిల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నప్పుడు భూముల అక్రమ బదిలీల్లో పాలు పంచుకున్నారని ఆరోపణలున్నాయి. హిందూ వర్గాల భూములను అక్రమంగా మరొక వర్గానికి బదిలీ చేశారని కూడా ఆరోపణలు వచ్చాయి. గత ఆరు నెలలుగా ఆమెపై నిఘా ఉంచి, నిర్ధారించుకున్న తర్వాతే ఈ దాడులు నిర్వహించినట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. నుపుర్ బోరా 2019 బ్యాచ్‌కు చెందిన అధికారిణి. ఆమె అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఆమెతో పాటు ఆమెకు సహకరించిన మరొక వ్యక్తిని కూడా అరెస్టు చేశారు.

Tags:    

Similar News