Pakistan: పాక్‌ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రదాడి: 10 మంది మృతి

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ హింసాత్మక ఘటనలు

Update: 2024-02-06 06:15 GMT

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. డేరా ఇస్మాయిల్‌ఖాన్‌ అనే జిల్లాలో చోడ్వాన్‌ పోలీస్ స్టేషన్‌పై ఒక్కసారిగా ఉగ్రమూకలు దాడి చేశాయి. ఈ కాల్పుల్లో 10 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. మరో ఆరుగురు పోలీసులు తీవ్ర గాయాలపాలయ్యారు.  సోమవారం ఉదయం 3 గంటలకు.. ఉగ్రవాదులు పోలీస్ స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారు. 

పోలీసు స్టేషన్‌లోకి ప్రవేశించిన ఉగ్రమూకలు.. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దాదాపు 10 మంది పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులు పోలీస్‌ స్టేషన్‌లోకి ప్రవేశించిన తర్వాత హ్యాండ్‌ గ్రనేడ్‌లను ఉపయోగించినట్లు స్థానిక అధికారులను ఊటంకిస్తూ ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్‌ వెల్లడించింది. దీని వల్లనే ఎక్కువ నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. కాగా, గత కొన్ని రోజులుగా ఖైబర్‌ ఫఖ్తుంఖ్వా, బలూచిస్థాన్‌లో ఉగ్రమూకలు రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు ఇలాంటి ఉగ్రదాడులు చోటుచేసుకోవడం పాకిస్థాన్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ పలు కేసుల్లో ఇరుక్కొని జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 

Tags:    

Similar News