అవధేష్ రాయ్ హత్య కేసులో వారణాసి కోర్టు సంచలన తీర్పు

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి కోర్టు 32 ఏళ్ల అవధేష్ రాయ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీని దోషిగా నిర్ధారించింది.

Update: 2023-06-05 08:30 GMT

అవధేష్ రాయ్ హత్య కేసులో వారణాసి కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీని దోషిగా కోర్టు నిర్ధారించింది. అయితే ఆగస్ట్ 3, 1991న కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే అజయ్ రాయ్ సోదరుడు అవధేష్ రాయ్ హత్యకు గురయ్యాడు. వారణాసిలోని తన నివాసం బయట ఉండగా దుండగులు ఆయనను కాల్చి చంపారు. ఈ కేసులో పోలీసులు ముఖ్తార్ అన్సారీ, భీమ్ సింగ్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ కలీమ్‌లను ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా పేర్కొనడం జరిగింది.

ఎన్నో ఏళ్ల తరువాత కోర్టు ఈ కేసులో తీర్పును వెల్లడించింది. తీర్పు వెలువడనున్న నేపథ్యంలో కోర్టు ఆవరణలో అలాగే నగరంలోని సున్నితమైన ప్రదేశల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కోర్టు తీర్పుపై మాజీ ఎమ్మెల్యే అజయ్ స్పందిస్తూ.. "మా ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఇప్పుడు తెరపడింది. నేను, నా తల్లిదండ్రులు, అవధేష్ కూతురు, కుటుంబం ఎంతగానో ఓపిక పట్టాం.. ప్రభుత్వాలు వచ్చాయి, పోయాయి కానీ ముఖ్తార్ తపించుకుంటున్నాడు. అయినా మేమే పట్టు విడవకుండా ప్రయత్నించాం అలాగే మా లాయర్ల కృషి వల్ల ఈ రోజు కోర్టు నా సోదరుడి హత్య కేసులో ముఖ్తార్‌ను దోషిగా నిర్ధారించింది" అని రాయ్ వెల్లడించారు.

Tags:    

Similar News