IGI CUSTOMS: ఢిల్లీ విమానాశ్రయంలో కట్టకట్టలు నోట్ల కట్టలు
ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం... ఎయిర్‌పోర్ట్‌ల్లో ఇంత భారీ మొత్తం పట్టుబడడం తొలిసారన్న అధికారులు;
ఢిలీ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ(foreign currency)ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం(seizure) చేసుకున్నారు. దేశంలోని విమానాశ్రయాల్లో ఇంత పెద్ద మొత్తంలో విదేశీ నగదు స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారని(biggest-ever seizure) కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (IGI) ఫ్లైట్ నెం. TK 0717లో ఇస్తాంబుల్‌కు వెళ్లేందుకు వచ్చిన ముగ్గురు తజికిస్థాన్ పౌరుల(Tajikistan nationals )ను టెర్మినల్ 3 వద్ద కస్టమ్స్ అధికారులు (Customs) అడ్డుకున్నారు.
తజకిస్థాన్ పౌరుల లగేజీని తనిఖీ చేయగా అందులో ఉన్న బూట్లలో దాచిపెట్టిన విదేశీ కరెన్సీ(foreign currency)ని గుర్తించారు. అనంతరం వారి లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేసి.. మొత్తం 7 లక్షల 20 వేల అమెరికా డాలర్లు, 4 లక్షల 66 వేల 200ల యూరోలను స్వాధీనం చేసుకున్నారు. భారత కరెన్సీలో వీటి విలువ దాదాపు రూ.10.67 కోట్లకు పైగా ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
అంతపెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ వారికి ఎలా చేరిందన్న అంశంపై ఆరా తీస్తున్నారు. ముగ్గురు తజికిస్థాన్ జాతీయుల్లో ఒక బాలుడు కూడా ఉన్నాడని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ భారత విమానాశ్రయాల్లో ఇంత భారీ మొత్తంలో పట్టుకున్న విదేశీ కరెన్సీ ఇదేనని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు.