Bihar CM : బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన ప్రకటన

Update: 2025-07-08 11:45 GMT

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహిళా రిజర్వేషన్లకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. బీహార్ రాష్ట్రానికి చెందిన మహిళలకు రాష్ట్రంలోని అన్ని స్థాయిలలోని అన్ని ప్రభుత్వ సేవలు, కేడర్లు పోస్టులలో ప్రత్యక్ష నియామకాలలో 35% రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ప్రకటించారు. ఈ రిజర్వేషన్ అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు వర్తిస్తుందన్నారు. అంతేకాకుండా బీహార్ యువజన కమిషన్ ఏర్పాటును కూడా నితీష్ కుమార్ ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్‌లో .. 'బీహార్ యువతకు గరిష్ట ఉపాధి అవకాశాలను అందించడం, వారికి శిక్షణ ఇవ్వడం వారిని బలంగా సమర్థులుగా మార్చడం అనే లక్ష్యంతో, రాష్ట్ర ప్రభుత్వం బీహార్ యువజన కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని . ఈరోజు బీహార్ యువజన కమిషన్ ఏర్పాటుకు మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపిందని తెలియజేయడానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అన్నారు. బీహార్ యువజన కమిషన్‌లో ఒక చైర్మన్, ఇద్దరు వైస్-ఛైర్మన్లు , ఏడుగురు సభ్యులు ఉంటారు, వీరి గరిష్ట వయోపరిమితి 45 సంవత్సరాలు. రాష్ట్రంలోని స్థానిక యువత రాష్ట్రంలోని ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో ప్రాధాన్యత పొందేలా ఈ కమిషన్ పర్యవేక్షిస్తుంది, అలాగే రాష్ట్రం వెలుపల చదువుతున్న, పనిచేస్తున్న యువత ప్రయోజనాలను కాపాడుతుంది.'

Tags:    

Similar News