రెండు ప్రధాన జాతీయ పార్టీలు పార్టీ పరంగా వ్యవస్థాగత మార్పులపై ఫోకస్ చేశాయి.. బీజేపీలో ఇప్పటికే ఆ దిశగా కసరత్తు పూర్తయింది.. అతి త్వరలో కాంగ్రెస్ పార్టీ కూడా వ్యవస్థాగత మార్పులపై కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.. త్వరలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.. వారం పదిరోజుల్లోనే ఆ ప్రకటన ఉండొచ్చని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి.. కొత్తగా ఏర్పాటు చేయబోయే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి 35 మంది నేతలను తీసుకునే అవకాశం కనిపిస్తోంది.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం పదవులు అదే విధంగా పార్టీలో కొత్తగా రెండు ఉపాధ్యక్ష పదవులు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.. ఉత్తరాది పార్టీ వ్యవహారాలకు ఒక ఉపాధ్యక్షుడు, దక్షిణాది పార్టీ వ్యవహారాలకు మరో ఉపాధ్యక్షుడిని నియమించే అవకాశం కనిపిస్తోంది.
సౌత్‌లో కాంగ్రెస్ దూకుడు మీద వెళ్తోంది.. కర్నాటకలో అధికారాన్ని కైవసం చేసుకోగా, తెలంగాణపై ఫోకస్ మరింత పెంచింది.. చేరికలతో తెలంగాణ కాంగ్రెస్‌కు బలం మరింత పెరుగుతుండగా, అధిష్ఠానం కూడా ప్రత్యేకంగా దృష్టిపెట్టింది.. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తెలంగాణకు చెందని కీలక నేతలకు ఛాన్స్ దక్కవచ్చనే ప్రచారం జరుగుతోంది.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రేసులో సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, మధుయాష్కీ, సంపత్ కుమార్, ఉత్తమ్ ఉన్నట్లు తెలుస్తోంది.. ములుగు ఎమ్మెల్యే సీతక్కతోపాటు మరొకరికి సీడబ్ల్యూసీలో ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.