Ranya Rao Case: సిద్ధూ ముంగిట స్మగ్లింగ్‌ కేసు- రన్యారావు పెళ్లికి వెళ్ళిన సీఎం

నటి రన్యారావుతో దిగిన ఫొటో షేర్‌ చేసిన బీజేపీ నేత మాలవీయ;

Update: 2025-03-13 03:00 GMT

స్మగ్లింగ్‌ కేసులో అరెస్టయిన నటి రన్యారావు కేసులో రాజకీయ నేతలెవ్వరికీ సంబంధాలు లేవంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ స్పష్టం చేసిన కొద్ది గంటలకే కీలక విషయం వెలుగులోకి వచ్చింది. నటి వివాహ వేడుకలో ఆమెతో కలిసి సీఎం సిద్ధరామయ్య దిగిన ఫొటో బయటపడింది. బీజేపీ నేత అమిత్‌ మాలవీయ ఈ ఫొటోను సామాజిక మాధ్యమంలో బుధవారం షేర్‌ చేశారు.

రన్యారావు స్మగ్లింగ్‌ కేసుకు సంబంధించిన సమస్య ఇప్పుడు సీఎం సిద్ధరామయ్య ఇంటి వరకు వచ్చింది. ఈ ఫొటోలో హోంశాఖ మంత్రి జి . పరమేశ్వర కూడా ఉన్నారు.ఈ కేసులో ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవంటూ డీకే శివకుమార్‌ ఈ విషయాన్ని కొట్టి పారేశారు అంటూ అమిత్‌ మాలవీయ విమర్శలు గుప్పించారు.

స్మగ్లింగ్‌ లో ఆమెతో సంబంధమున్న వ్యక్తులను గుర్తించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమెకు సంబంధించిన ప్రదేశాలు, వివాహం అయిన హోటల్‌ కు వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు.నటి పెళ్లికి హాజరైన అతిథులు,వారిచ్చిన కానుకలపై దృష్టి సారిస్తున్నారు.ఈ క్రమంలోనే రన్యారావు వివాహ వేడుకకుసీఎం సిద్ధరామయ్య హాజరైన ఫొటో బయటకురావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ స్మగ్లింగ్‌ లో ఆయన పాత్ర పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు నటి బెయిల్‌ కోసం ప్రత్యేక కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.ఈ క్రమంలోనే కేసులో మరికొన్ని కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.విమనాశ్రయంలో ఆమె తనిఖీలు తప్పించుకునేందుకు సాయం చేసిన అధికారికి..సంబంధితశాఖ అధికారుల నుంచి సూచనలు అందాయని న్యాయస్థానానికి డీఆర్‌ఐ తెలిపింది.

ఇటీవల దుబాయ్‌ నుంచి బెంగళూరుకు 14.2 కిలోల బంగారంతో వచ్చిన ఆమెను ..విమానాశ్రయం నుంచి నిష్క్రమించే చివరి నిమిషంలో అధికారులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. తరచూ దుబాయ్‌ వెళ్లడం...వెళ్లిన ప్రతిసారీ ఒకే రకమైన దుస్తులు ధరించడంతో అనుమానం వచ్చి ఆమె పై నిఘా పెట్టగాఈ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది.దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. స్మగ్లింగ్‌ కేసులో పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావు బెయిల్‌ పిటిషన్‌పై నిర్ణయాన్ని ఆర్థిక నేరాలు విచారించే ప్రత్యేక కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఈ కేసు తీవ్రత, రన్యారావుకు ఉన్న సంబంధం దృష్టిలో ఉంచుకుని ఆమెకు బెయిల్‌ మంజూరు చేయరాదని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) వాదించింది. సీనియర్ల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే తాను ఎయిర్‌పోర్టులో రన్యారావుకు రక్షణగా వెళ్లానంటూ అక్కడ ఆమెకు సహాయం చేసిన పోలీస్‌ అధికారి తమ విచారణలో వెల్లడించారన్నారు.

Tags:    

Similar News