BJP MP Tejasvi : ఓ ఇంటివాడైన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య.. కన్నడ గాయనితో వివాహం
కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఓ ఇంటివాడు అయ్యాడు. చెన్నైకి చెందిన ప్రముఖ గాయని, శాస్త్రీయ సంగీతం, భరతనాట్య కళాకారిణి అయిన శివశ్రీ స్కంద ప్రసాదు వివాహం చేసుకున్నాడు. బెంగళూరులో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు, బీజేపీ నేతలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. శివశ్రీ శాస్త్రయూని వర్సిటీ నుంచి బయో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. మద్రాస్ యూనివర్సిటీ నుంచి భరతనాట్యంలో ఎంఏ, మద్రాస్ సంస్కృత కాలేజీలో సంస్కృతంలో ఎంఏ పట్టా పుచ్చుకున్నారు. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ -2లో కన్నడ వెర్షన్ లో శివశ్రీ ఓ గాయనిగా పాట ఆలపించారు.