BJP: రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ
తొమ్మిది మంది పేర్లు ప్రకటించిన అధిష్టానం;
పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు భాజపా తన అభ్యర్థులను ఖరారు చేసింది. సెప్టెంబర్ 3వ తేదీన జరగనున్న ఈ ఎన్నికలకు కేంద్రమంత్రులు రణ్‌వీత్‌సింగ్ బిట్టూ (రాజస్థాన్ నుంచి), జార్జి కురియన్ (మధ్యప్రదేశ్ నుంచి)ను అభ్యర్థులగా బరిలో దించింది. బిజూ జనతాదళ్ మాజీ నేత మమత మొహంతను ఒడిశా నుంచి తమ అభ్యర్థిగా ప్రకటించిన కమలం పార్టీ.. బార్ కౌన్సిల్ ఛైర్మన్, సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రాను బిహార్ నుంచి బరిలోకి దించింది. సార్వత్రిక ఎన్నికల్లో బరిలో దిగిన నేపథ్యంలో పలువురు సభ్యులు రాజీనామాలు చేయడం, అలాగే, తెలంగాణలో భారాస ఎంపీ కేశవరావు, ఒడిశాలో బిజేడీ ఎంపీ మమతా మొహంత తమ పదవులకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
అభ్యర్థుల జాబితా ఇదే..
సర్దార్ రణ్‌వీత్ సింగ్‌బిట్టూ - రాజస్థాన్
జార్జ్ కురియన్ - మధ్యప్రదేశ్
మిషన్ రంజన్ దాస్, రామేశ్వర్ తెలి - అస్సాం (2)
మనన్ కుమార్ మిశ్రా - బిహార్
కిరణ్ చౌధరి - హరియాణా
ధైర్యశిల్ పాటిల్ - మహారాష్ట్ర
మమత మొహంత - ఒడిశా
రజీబ్ భట్టాచార్జీ - త్రిపుర
రాజ్యసభలోని 12 స్థానాల్లో ఉప ఎన్నికలకు గత నెలలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ఈ ఖాళీలకు సంబంధించి సెప్టెంబరు 3న ఎన్నికలు నిర్వహించనుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపడతారు.