BJP: ఐదు రాష్ట్రాల ఎన్నికలపై బీజీపే నజర్‌

మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌లో తొలి జాబితా విడుదల... రాజస్థాన్‌లో రెండు కమిటీలు ఏర్పాటు..;

Update: 2023-08-18 03:45 GMT

ఈ ఏడాది చివరిలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలపై దృష్టిసారించిన భారతీయ జనతా పార్టీ(bjp) అభ్యర్థుల ప్రకటన ప్రక్రియ మొదలుపెట్టింది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలో చర్చించిన తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌( Madhya Pradesh and Chhattisgarh) ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితా(BJP releases first list)ను వెల్లడించింది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 సీట్లు ఉండగా తొలి విడతలో 39 పేర్ల(39 for MP elections)ను కమలం పార్టీ ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 స్థానాలు ఉంటే 21 మంది(21 candidates for Chhattisgarh polls )తో తొలి జాబితా విడుదల చేసింది. రెండు రాష్ట్రాల్లోనూ ఐదుగురు చొప్పున మహిళలకు టిక్కెట్లు ఇచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లో ముఖ్యమంత్రి భూపేష్‌ భగేల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పటాన్‌ స్థానంలో పార్టీ తరఫున దుర్గ్‌ ఎంపీ విజయ్ భగేల్‌ను పోటీకి పెట్టింది.


మరోవైపు రాజస్థాన్‌ శాసనసభ ఎన్నికల కోసం భాజపా రెండు కమిటీలను ప్రకటించింది. 21 మంది సభ్యులతో కూడిన ఎన్నికల నిర్వహణ కమిటీకి మాజీ ఎంపీ నారాయణ్ పంచారియా నేతృత్వం వహిస్తారని బీజేపీ తెలిపింది. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నాయకత్వంలో ప్రదేశ్ సంకల్ప్ పత్ర పేరుతో ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ రెండు కమిటీల్లో మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజేకు చోటు దక్కలేదు. వసుంధర రాజే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని రాజస్థాన్ బీజేపై ఇన్‌ఛార్జ్‌ అరుణ్‌ సింగ్ తెలిపారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా రాజే ఇంతకంటే పెద్ద పాత్ర పోషించాల్సి ఉందన్నారు. తమ వ్యూహాలన్నీ సిద్ధంగా ఉన్నాయని కేంద్ర మంత్రి, రాజస్థాన్‌ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. రాజస్థాన్‌ ప్రజలు తమకు సంపూర్ణ మెజార్టీని కట్టబెడతారని విశ్వాసం వ్యక్తం చేశారు.


ఈ కమిటీల్లో ఎంపీ కిరోడీ లాల్ మీనా, మాజీ కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లకు చోటు లభించగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే తోపాటు రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి, ప్రతిపక్ష నాయకుడు రాజేంద్ర రాథోడ్ ల పేర్లను ఈ కమిటీ జాబితాల్లో చేర్చకపోవడం చర్చనీయాంశమంది. మాజీ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాజీ రాష్ర అధ్యక్షుడు సతీష్ పూనియాలకి కూడా ఈ కమిటీల్లో చోటు దక్కలేదు.

అశోక్ గెహ్లోత్‌ ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో బీజేపీ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. అవినీతి తోపాటు మహిళలపై జరుగుతున్న అరాచకాలనే ప్రధానాస్త్రాలుగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం ప్రజలకు అందిస్తోన్న సంక్షేమ పథకాలను తిప్పికొట్టడమే బీజేపీకి పెను సవాలుగా మారింది. 

Tags:    

Similar News