Delhi : ఢిల్లీని కమ్మేసి.. ఆప్ ను ఊడ్చేసిన కమలం

Update: 2025-02-08 14:00 GMT

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. 27 ఏళ్ల తర్వాత అక్కడ అధికారాన్ని చేపట్టడానికి వ్యూహాలు రచించింది. ఢిల్లీని ఆనుకొని ఉన్న హరియాణా, ఉత్తర ప్రదేశ్ , రాజస్థాన్‌లో రూలింగ్‌లో ఉండటం, కేంద్రంలోనూ హ్యాట్రిక్ పాలన కొనసాగించడం కమలం పార్టీకి బాగా కలిసొచ్చింది. 2017 నుంచి ఉత్తర ప్రదేశ్లో, 2023 నుంచి రాజస్థాన్, హరియాణాలో గతేడాది కమలం 2వసారి మళ్లీ అధికారంలోకి రావడంతో కాషాయం శ్రేణులు హస్తిన ఓటర్లను ప్రభావితం చేయగలిగారు.

ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ విజయం సాధించడం వెనక ముస్లిం మహిళల పాత్ర ఉందని విశ్లేషకులు అంటున్నారు. ట్రిపుల్ తలాక్, సెంట్రల్ స్కీమ్స్ ఇందుకు దోహదం చేశాయని చెప్తున్నారు. ఆ మతంలోని పశుమందా వంటి వెనకబడిన వర్గాలు అండగా నిలిచాయని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్, ఆప్ తమను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయన్న IUML ప్రెసిడెంట్ తొలిసారి బీజేపీకి ఓటేయడం, అనుచరులను ప్రభావితం చేయడమూ కలిసొచ్చిందని అంటున్నారు.

Tags:    

Similar News