Brij Bhushan: లైంగిక వేధింపుల కేసులో MP బ్రిజ్‌భూషణ్‌కు మధ్యంతర బెయిల్

జూన్ 15న బ్రిజ్ భూషణ్‌పై ఛార్జ్‌షీట్ నమోదు చేశారు. 354 సెక్షన్, సెక్షన్ 354A, సెక్షన్ 354D, సెక్షన్ 504 కింద కేసులు నమోదు చేశారు.

Update: 2023-07-18 11:29 GMT

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల(Sexual Harrasment) కేసులో భాజపా(BJP) ఎంపీ, WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌(Brij Bhushan Singh) బెయిల్‌పై విడుదలయ్యాడు. ఢిల్లీలోని స్థానిక రౌస్ ఎవెన్యూ న్యాయస్థానం రూ.25000 పూచీకత్తుతో 2 రోజులకు మధ్యంతర బెయిల్‌(Interim Bail)కు అనుమతించింది. ఇదే కేసుకు సంబంధించి ఎంపీకి సహకరించారన్న ఆరోపణల కేసులో WFI అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్‌కి కూడా మధ్యంతర బెయిల్‌ లభించింది. అయితే సాధారణ బెయిల్‌ పిటిషన్‌పై గురువారం నుంచి వాదనలు జరగనున్నాయి.

బెయిల్ మంజూరు సందర్భంగా మీడియా ప్రతినిధులకు కూడా సూచనలు చేసింది. ఈ కేసుకు సంబంధించి రిపోర్టింగ్ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరింది. న్యాయమూర్తుల వ్యాఖ్యలు అపార్తాలు వచ్చేట్లు ప్రచురించవద్దని తెలిపింది. రిపోర్టింగ్ సరిగా చేయకుండా దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, అది కోర్టు ధిక్కరణగా పరిగణిస్తాం అని హెచ్చరించింది.


ఓ మైనర్‌తో సహా ఆరుగురు రెజ్లర్లు ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బ్రిజ్‌ భూషణ్‌(WFI)పై ఏప్రిల్ నెలలో లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జూన్ 2న ఢిల్లీ పోలీసులు 2 ఎఫ్ఐఆర్‌(FIR)లు, 10 ఫిర్యాదులను స్వీకరించారు. అసభ్యకరంగా రెజ్లర్లను తాకడం, అకారణంగా వారి ఛాతిని, శరీరాన్ని స్పర్శించడం వంటి తీవ్రమైన ఆరోపణలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే మైనర్, తండ్రి వారి ఆరోపణలను వెనక్కి తీసుకున్నారు.

ఫోటో, వీడియో, కాల్ వివరాలు వంటి సాక్ష్యాధారాలతో జూన్ 15న బ్రిజ్ భూషణ్‌పై 1500 పేజీల ఛార్జ్‌షీట్ నమోదు చేశారు. IPC 354 సెక్షన్, సెక్షన్ 354A, సెక్షన్ 354D, సెక్షన్ 504 కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ ఆరోపణలన్నింటినీ బ్రిజ్‌ భూషన్ తిరస్కరిస్తూ, ఖండించారు.

Tags:    

Similar News