Tamil Nadu: తమిళనాడు బస్సు ప్రమాదం అప్డేట్.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం..

Tamil Nadu: తిరుపత్తూరు జిల్లాలోని సెంబరై కొండపై ఆలయానికి భక్తులతో వెళ్తున్న బస్సు..అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది.

Update: 2022-04-03 09:16 GMT

Tamil Nadu: తమిళనాడులో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. తిరుపత్తూరు జిల్లాలోని సెంబరై కొండపై ఉన్న ఆలయానికి భక్తులతో వెళ్తున్న బస్సు..అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 11 మంది మృతిచెందగా.. 19మంది గాయపడ్డారు. మూల మలుపు వద్ద వాహనాన్నిడ్రైవర్‌ అదుపు చేయలేకపోవడంతోనే... ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

ప్రమాదం సమయంలో వాహనంలో మొత్తం 30 మంది ఉన్నట్టు పేర్కొన్నారు. మృతులంతా పులియూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, బాలికలే ఉన్నారు. క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బస్సు ప్రమాదంపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ విచారం వ్యక్తంచేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని వైద్యశాఖ అధికారుల్ని ఆదేశించారు. అటు మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడిన వారి కుటుంబాలకు 50వేల చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది

Tags:    

Similar News