Manish Sisodia : ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా లాకర్లు తనిఖీ..
Manish Sisodia : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై దర్యాప్తును వేగవంతం చేశారు.;
Manish Sisodia : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై దర్యాప్తును వేగవంతం చేశారు. మనీశ్ సిసోడియా బ్యాంక్ లాకర్లను సీబీఐ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఢిల్లీ మద్యం పాలసీలో అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న అధికారులు.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై కేసు నమోదు చేశారు.
విచారణలో భాగంగా ఢిల్లీ ఘజియాబాద్‌లోని సిసోడియా అకౌంట్ ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చేరుకున్నారు. అటు మనీశ్ సిసోడియాతో పాటు అతని భార్య కూడా బ్యాంక్‌కు వెళ్లారు. వీరిద్దరి సమక్షంలో బ్యాంక్ లాకర్లు తెరుస్తున్నారు.
మనీశ్ సిసోడియా ట్విన్ టవర్ కరెప్షన్‌కు పాల్పడ్డారంటూ బీజేపీ ఆరోపిస్తోంది. ఎడ్యుకేషన్ పాలసీ, లిక్కర్ పాలసీలో భారీ కుంభకోణాలు జరిగాయంటూ ట్విన్ టవర్ కరెప్షన్‌తో పోల్చుతూ విమర్శలు గుప్పించింది. ఢిల్లీ ప్రజలు పాఠశాల కావాలని అడుగుతుంటే.. కేజ్రీవాల్ సర్కార్ మాత్రం మధుశాల ఇస్తోందంటూ బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు.
బీజేపీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ఆమ్‌ఆద్మీ పార్టీ.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై పోరు నడుపుతున్నారు. 1400 కోట్ల రూపాయల మార్పిడి వ్యవహారంలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని కోరుతూ ఇవాళ ఆప్ ఎమ్మెల్యేలు సీబీఐ డైరెక్టర్‌ను కలవబోతున్నారు.
సీబీఐ స్పందించకపోతే న్యాయపోరాటం చేయాలని ఆప్ భావిస్తోంది. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ తో పాటు ఆయన వెనుకున్న బీజేపీ కూడా ఇరుకున పడటం ఖాయమని ఆప్ అంచనా వేస్తోంది. 2016లో గ్రామీణ ఖాదీ బోర్డు ఛైర్మన్‌గా వీకే సక్సేనా పనిచేశారు. బీజేపీ నోట్ల రద్దు చేసిన సమయంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి ఏకంగా 1400 కోట్ల పాత నోట్లను మార్పిడి చేశారని ఆప్ ఆరోపిస్తోంది. ఇందుకు ఆధారాలు కూడా ఉన్నాయంటోంది.