సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, (CBSE) తన అధికారిక వెబ్‌సైట్‌లో CBSE 12వ బోర్డు ఫలితాలను 2023 ప్రకటించింది. 12వ తరగతి ఫలితాలు ఉదయం 10:45 గంటలకు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ CBSE 12వ ఫలితాలను CBSE-cbse.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చాని అధికారులు తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది మొత్తం ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంది. గతేడాది 92.71 శాతం ఉత్తీర్ణత నమోదవగా.. ఈ ఏడాది 87.33 శాతం నమోదైంది.
ఈ ఏడాది బాలికలు 6.01 శాతం మెరుగైన ఫలితాలు సాధించారు.
గతేడాది ఇదే రోజున సీబీఎస్ఈ 10,12వ తరగతి ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఈసారి CBSE 12వ తరగతి ఫలితాలను విడిగా ప్రకటించారు. CBSE ఫలితాలు 2023 ఆన్‌లైన్‌లో ప్రకటించిన తర్వాత, విద్యార్థులు cbse.gov.in మరియు cbse.nic.inలలో సెంట్రల్ బోర్డ్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
విద్యార్థులు తమ డిజిలాకర్ ఖాతాలను యాక్టివేట్ చేసుకోవడానికి 6-అంకెల సెక్యూరిటీ పిన్‌ని ఉపయోగించి యాక్టివేట్ చేసుకోవచ్చని బోర్డు సూచించింది. సర్క్యులర్ ప్రకారం, CBSE యొక్క అధికారిక వెబ్‌సైట్ పరిణం మంజుష నుంచి సెక్యూరిటీ పిన్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత విద్యార్థులు వారి సంబంధిత పాఠశాలల నుంచి వారి 6-అంకెల సెక్యూరిటీ పిన్‌ను పొందవచ్చు. పాఠశాలలు వెబ్‌సైట్‌ను సందర్శించి, వారి LOC ఆధారాలను ఉపయోగించి లాగిన్ చేసి, ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.