CENSUS: రెండు దశల్లో చరిత్రాత్మక డిజిటల్ గణన

రూ.11,718 కోట్లను కేటాయింపు.. కేంద్ర కేబినెట్‌ ‌కీలక నిర్ణయాలు.. పూజ్య బాపు గ్రామీణ్‌ ‌రోజ్‌గార్‌ ‌యోజనగా ఉపాధి హామీ పేరు

Update: 2025-12-14 07:30 GMT

చరి­త్రా­త్మక జన­గ­ణన ని­ర్వ­హణ కోసం కేం­ద్ర మం­త్రి­వ­ర్గం ఏకం­గా రూ.11,718 కో­ట్ల­కు సం­బం­ధిం­చిన బడ్జె­ట్‌­ను ఆమో­దిం­చిం­ది. అలా­గే మహా­త్మా గాం­ధీ ఉపా­ధి హామీ పథకం పే­రు­ను కూడా మా­ర్చిం­ది. పూ­జ్య బాపు గ్రా­మీ­ణ్ రో­జ్‌­గా­ర్ యో­జ­న­గా మా­రు­స్తూ ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. అలా­గే పని­ది­నాల సం­ఖ్య­ను 100 నుం­చి 125కి పెం­చిం­ది. రో­జు­కు ఇచ్చే కనీస వే­త­నా­న్ని రూ.240కి సవ­రిం­చిం­ది. ప్ర­ధా­ని మోదీ అధ్య­క్ష­తన జరి­గిన కే­బి­నె­ట్‌­లో పలు ని­ర్ణ­యా­లు తీ­సు­కు­న్నా­రు. వి­వ­రా­ల­ను కేం­ద్ర మం­త్రి అశ్వి­నీ వై­ష్ణ­వ్ వె­ల్ల­డిం­చా­రు. జన­గ­ణ­న­లో కుల గణను చే­ర్చ­డం­తో­పా­టు రెం­డు దశ­ల్లో ని­ర్వ­హిం­చా­ల­ని ని­ర్ణ­యిం­చా­రు. 2026 ఏప్రి­ల్ నుం­చి సె­ప్టెం­బ­ర్ వరకు గృ­హా­ల­ను జా­బి­తా చేసి, లె­క్కి­స్తా­మ­ని చె­ప్పా­రు. 2027 ఫి­బ్ర­వ­రి నుం­చి జనా­భా లె­క్కల సే­క­ర­ణ­పై దృ­ష్టి పె­డ­తా­మ­న్నా­రు. ఇదే తొలి డి­జి­ట­ల్ జన­గ­ణన అవు­తుం­ద­ని మం­త్రి పే­ర్కొ­న్నా­రు. ఈ జన­గ­ణన ప్ర­క్రి­య­కు సం­బం­ధిం­చి మా­ర్చి 1, 2027ను రి­ఫ­రె­న్స్ తే­దీ­గా ని­ర్ణ­యిం­చా­రు. జన­గ­ణన మొ­ద­టి దశ ఏప్రి­ల్ 2026 నుం­డి సె­ప్టెం­బ­ర్ 2026 వరకు కొ­న­సా­గు­తుం­ది, రెం­డవ దశ ఫి­బ్ర­వ­రి 2027లో పూ­ర్త­వు­తుం­ది.

బీమా రం­గం­లో వంద శాతం వి­దే­శీ ప్ర­త్య­క్ష పె­ట్టు­బ­డుల బి­ల్లు­కు కూడా కే­బి­నె­ట్ ఆమో­దం తె­లి­పిం­ది. ప్ర­స్తు­తం సా­ధా­రణ, జీ­విత, ఆరో­గ్య బీ­మా­లో 74 శాతం వరకు ఎఫ్‌­డీ­ఐ­కి అను­మ­తి ఉంది. ఈ రం­గం­లో­కి ఎఫ్‌­డీ­ఐ­ల­కు పూ­ర్తి­గా అను­మ­తి­ని­స్తే దే­శీయ పె­ట్టు­బ­డు­లూ పె­రి­గే అవ­కా­శం ఉం­ద­ని కేం­ద్రం అం­చ­నా వే­స్తోం­ది. 100 శాతం ఎఫ్‌­డీ­ఐ­కి అను­మ­తి­స్తే వి­దే­శీ సం­స్థ­లు భా­ర­తీయ కం­పె­నీ­ల­పై ఆధా­ర­ప­డ­కుం­డా సొం­తం­గా పని­చే­య­డా­ని­కి ఆస్కా­రం ఏర్ప­డు­తుం­ద­ని, దీ­ని­వ­ల్ల ఈ రం­గా­ని­కి మేలు జరి­గే అవ­కా­శా­లు­న్నా­య­ని అభి­ప్రా­య­ప­డు­తోం­ది.కే­బి­నె­ట్ తీ­సు­కు­న్న ఆర్థి­క­ప­ర­మైన ని­ర్ణ­యాల గు­రిం­చి మం­త్రి వై­ష్ణ­వ్ మా­ట్లా­డు­తూ దే­శీయ ఉత్ప­త్తి సా­మ­ర్థ్యం పె­రు­గు­ద­ల­ను కూడా ప్ర­స్తా­విం­చా­రు. దే­శీ­యం­గా ఉత్ప­త్తి పె­ర­గ­డం వల్ల ఆర్థి­క­ప­ర­మైన ని­ర్ణ­యాల సా­ను­కూల ఫలి­తం­గా దే­శా­ని­కి సు­మా­రు రూ.60,000 కో­ట్ల వి­దే­శీ కరె­న్సీ ఆదా అవు­తోం­ద­ని పే­ర్కొ­న్నా­రు. బొ­గ్గు గను­ల్లో పలు సం­స్క­ర­ణ­ల­కి కే­బి­నె­ట్ ఆమో­దం తె­లి­పిం­ది.

పీఎం కి­సా­న్ సమ్మా­న్ యోజన కింద అం­దిం­చే మొ­త్తా­న్ని రూ.6,000 నుం­చి రూ.10,000 వరకు పెం­చా­ల­ని ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. దే­శ­వ్యా­ప్తం­గా 57 కొ­త్త కేం­ద్రీయ వి­ద్యా­ల­యాల ఏర్పా­టు­కు కే­బి­నె­ట్ ఆమో­దం తె­లి­పిం­ది. ఇం­దు­లో తె­లం­గా­ణ­కు 4, ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­కు 4 మం­జూ­రు చే­సిం­ది. నా­లు­గు కీ­ల­క­మైన రై­ల్వే ప్రా­జె­క్టు­ల­కూ ఆమో­దం తె­లి­పిం­ది.సహ­కార రం­గా­న్ని మరింత బలో­పే­తం చే­య­డా­ని­కి రూ.2,000 కో­ట్ల ఆర్థిక సహా­యం అం­దిం­చ­ను­న్నా­రు. పీఎం కి­సా­న్ సంపద యో­జ­న­కు రూ.6,520 కో­ట్లు కే­టా­యిం­చ­ను­న్నా­రు. క్వాం­టం టె­క్నా­ల­జీ పరి­శో­ధన, అభి­వృ­ద్ధి­ని ప్రో­త్స­హిం­చ­డా­ని­కి అద­నం­గా రూ.4,000 కో­ట్ల ని­ధు­లు కే­టా­యిం­చ­ను­న్నా­రు.మై­క్రో, స్మా­ల్ అండ్ మీ­డి­యం ఎం­ట­ర్‌­ప్రై­జె­స్‌­ల­కు బ్యాం­కుల నుం­చి సు­ల­భం­గా రు­ణా­లు లభిం­చేం­దు­కు వీ­లు­గా రూ.15,000 కో­ట్ల­తో కొ­త్త క్రె­డి­ట్ గ్యా­రెం­టీ పథ­కా­ని­కి గ్రీ­న్ సి­గ్న­ల్ ఇచ్చిం­ది. దే­శం­లో­ని డి­జి­ట­ల్ మౌ­లిక సదు­పా­యా­ల­ను రక్షిం­చ­డా­ని­కి సై­బ­ర్ దా­డు­ల­ను ని­రో­ధిం­చ­డా­ని­కి సై­బ­ర్ సె­క్యూ­రి­టీ పా­ల­సీ­కి ఆమో­దం తె­లి­పిం­ది.సె­మీ­కం­డ­క్ట­ర్ తయా­రీ­ని ప్రో­త్స­హిం­చేం­దు­కు రూ.12,000 కో­ట్లు కే­టా­యిం­పు. కొ­త్త సె­మీ­కం­డ­క్ట­ర్ తయా­రీ కర్మా­గా­రా­ల­ను నె­ల­కొ­ల్పే సం­స్థ­ల­కు ఆర్థిక సహా­యం పెం­పు. ప్ర­ధాన మం­త్రి ఆవా­స్ యోజన కింద అద­నం­గా 1.5 కో­ట్ల గృ­హా­ల­ను ని­ర్మిం­చ­డా­ని­కి ఆమో­దం ఇచ్చిం­ది.చి­న్న ఉప­గ్ర­హా­ల­ను ప్ర­యో­గిం­చ­డా­ని­కి వీ­లు­గా తమి­ళ­నా­డు­లో­ని కు­ల­శే­ఖ­ర­ప­ట్నం వద్ద కొ­త్త ప్ర­యోగ వే­దిక ని­ర్మా­ణా­ని­కి గ్రీ­న్ సి­గ్న­ల్ తె­లి­పిం­ది. ‘మేక్ ఇన్ ఇం­డి­యా’ కా­ర్య­క్ర­మా­న్ని రక్షణ రం­గం­లో బలో­పే­తం చే­య­డా­ని­కి, రక్షణ రం­గం­లో వి­దే­శీ ప్ర­త్య­క్ష పె­ట్టు­బ­డుల పరి­మి­తి పెం­పు­న­కు ఆమో­దం అల­భిం­చిం­ది.దే­శం­లో­ని మా­రు­మూల ప్రాం­తా­ల­కు సైతం వై­ద్య సే­వ­ల­ను అం­దిం­చ­డా­ని­కి నే­ష­న­ల్ టెలి-మె­డి­సి­న్ నె­ట్‌­వ­ర్క్ ఏర్పా­టు­కు ఆమో­దం ఇచ్చిం­ది. నీ­టి­పా­రు­దల పథ­కా­ల­కు జా­తీయ మి­ష­న్ ఏర్పా­టు చే­సేం­దు­కు గ్రీ­న్ సి­గ్న­ల్ ఇచ్చిం­ది.

Tags:    

Similar News