Central Cabinet Approves : స్పోర్ట్స్ పాలసీకి కేంద్ర కేబినెట్ ఓకే

Update: 2025-07-02 08:30 GMT

కొత్త క్రీడా విధానానికి కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. ఇవాల్టి సమావేశంలో రూ. 3 లక్షల కోట్ల విలువైన పథకాలకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం లభించింది. పరిశోధనాభివృద్ధి, ఆవిష్కరణల్లో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పరి శోధన అభివృద్ధి ఆవిష్కరణ పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకానికి లక్ష కోట్లు కేటాయింపునకు పచ్చజెండా ఊపింది. ఆర్డీఐలో ప్రైవేటు రంగ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తక్కువ వడ్డీ రేటు లేదా వడ్డీరహిత దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ లేదా రీఫైనాన్సింగ్ అందించడమే ఈ పథకం లక్ష్యమని కేంద్రం పేర్కొంది. ప్రైవేట్ రంగం నిధులు విషయంలో ఎదుర్కొనే అడ్డంకులు, సవాళ్లను అధి గమించేందుకు దీన్ని డిజైన్ చేసినట్లు తెలిపింది. ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న అనుసంధన్ జాతీయ పరిశోధనా ఫౌండేషన్ పాలక మండలి.. ఆర్డీఐ పథకానికి విస్తృత వ్యూహాత్మక దిశానిర్దేశం చేస్తుందని పేర్కొంది. దేశంలో క్రీడా మౌలిక సదుపాయాలు పెంచడం, క్రీడాకారుల సమగ్రాభి వృద్ధే లక్ష్యంగా జాతీయ క్రీడా విధానం 2025కు ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాల పథకానికి ఆమోదం తెలిపింది. తయారీ రంగంలో ఉపాధి కల్పించే పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వనుంది. రెండేళ్ల కాలపరిమితితో ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాల పథకాన్ని ప్రకటించింది. తమిళనాడులోని పరమకుడిరామనాథపురం హైవే విస్తరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కింద 46.7 కి.మీల పొడవైన రహదారి నిర్మాణానికి రూ.1853 కోట్ల వ్యయం చేయనుంది.

Tags:    

Similar News