Fuel And Gas Rates: దేశ ప్రజలకు శుభవార్త.. చమురు, గ్యాస్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన..
Fuel And Gas Rates: దేశంలో రోజురోజుకూ ఇంధన ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న ప్రజలకు కేంద్రం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.;
Fuel And Gas Rates: దేశంలో రోజురోజుకూ ఇంధన ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న ప్రజలకు కేంద్రం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. చమురు, గ్యాస్‌పై పన్నులు తగ్గించింది. లీటరు పెట్రోల్‌పై 8, డీజిల్‌పై 6 రూపాయల ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో లీటరు పెట్రోల్‌పై 9 రూపాయల 50 పైసలు.. డీజిల్‌పై 7 రూపాయలు తగ్గే అవకాశం ఉంది.
మరోవైపు పీఎం ఉజ్వల్ యోజన పథకం కింద 9 కోట్ల మంది లబ్ధిదారులకు ఒక్కో సిలిండర్‌పై 200 రూపాయల రాయితీ ఇస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. దీంతో వినియోగదారులకు ఊరట లభించనుంది. ఐరన్, స్టీల్‌పై కస్టమ్స్ డ్యూటీని కేంద్రం తగ్గించింది. ప్లాస్టిక్ ఉత్పత్తులు, ముడి పదార్థాలపై దిగుమతి సుంకం తగ్గించనున్నట్లు తెలిపింది.