అంతర్జాతీయ విమానసర్వీసులకు అనుమతిలేదు : కేంద్రమంత్రి హర్షవర్ధన్
దేశంలో కరోనా పరిస్థితులపై.. లోక్‌సభ జీరో అవర్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వివరణ ఇచ్చారు. పది రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అధికంగా..;
దేశంలో కరోనా పరిస్థితులపై.. లోక్‌సభ జీరో అవర్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వివరణ ఇచ్చారు. పది రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉందన్నారు. ఐదు రాష్ట్రాల్లో 60 శాతం కేసులు నమోదవతున్నాయన్నారు. ప్రపంచ దేశాలతో పోల్చితే మనదేశంలో కరనో మరణాల రేటు చాలా తక్కువగా ఉందన్నారు. వైరస్ వ్యాప్తి నివారణ, గుర్తింపులో కేంద్రం తీసుకుంటున్న చర్యల్ని ఆయన వివరించారు. ప్రస్తుతానికి అంతర్జాతీయ విమానసర్వీసులకు అనుమతివ్వడంలేదన్నారు.