Mukesh Ambani : ట్రంప్‌తో ముఖేశ్ అంబానీ భేటీ
ట్రంప్ కోసం ఏర్పాటు చేసిన విందుకు హాజరు;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం అరబ్ దేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ట్రంప్ ప్రస్తుతం ఖతార్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడ ట్రంప్‌ను ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మర్యాదపూర్వకంగా కలిశారు.
ట్రంప్ కోసం ఎమిర్ ఆఫ్ ఖతార్ దోహాలో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసింది. ఈ విందుకు పలువురు సీఈవోలు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ఖతర్ లుసైల్ ప్యాలెస్‌లో నిర్వహించిన విందులో ముకేశ్ అంబానీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌తో పాటు ఖతర్ షేక్ ఎమిర్ తమిమ్ బిన్ హమీద్ తో ముఖేశ్ అంబానీ ముచ్చటించారు. ట్రంప్‌తో పలు అంశాలపై అంబానీ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్‌తో అంబానీ సమావేశం కావడం ఇది రెండోసారి. జనవరిలో ప్రమాణ స్వీకారోత్సవానికి ఒక రోజు ముందు ట్రంప్ ఇచ్చిన విందులో ముఖేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ పాల్గొని ట్రంప్‌ను కలిసిన విషయం తెలిసిందే.