Mumbai: యువతి బ్లాక్ మెయిల్.. రూ.3 కోట్లు పోవడంతో సీఏ ఆత్మహత్య

ప్రైవేటు వీడియోతో యువతి బ్లాక్ మెయిల్;

Update: 2025-07-08 06:30 GMT

ముంబైలోని సాంటాక్ర‌జ్‌లో ఉన్న 32 ఏళ్ల వ్య‌క్తిని అత‌ని స్నేహితులు బ్లాక్ మెయిల్చే శారు. ఓ ప్రైవేటు వీడియోతో అత‌న్ని బెదిరించి .. అత‌ని ఖాతాలో ఉన్న సొమ్మును డ్రా చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌తో మాన‌సిక ఆందోళ‌న‌కు లోనైన రాజ్ లీలా మోరే ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అత‌ను చార్టెడ్ అకౌంటెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. సీఏ రాజ్ లీలా మృతి ప‌ట్ల వ‌కోలా పోలీసు స్టేష‌న్‌లో ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. రాజ్ వ‌ద్ద నుంచి మూడు పేజీల సూసైడ్ నోట్ రిక‌వ‌రీ చేశారు.

త‌న ఆత్మ‌హ‌త్య‌కు రాహుల్ ప‌ర్వాని, సాబా ఖురేషి కార‌ణ‌మ‌ని రాజ్ నోట్‌లో పేర్కొన్నాడు. కంపెనీ అకౌంట్ నుంచి డ‌బ్బులు చోరీ చేసేలా వ‌త్తిడి చేసిన‌ట్లు చెప్పాడు. త‌న స్వంత సేవింగ్స్‌ను కూడా బ్రేక్ చేసేలా ఆ ఇద్ద‌రూ ప్ర‌వ‌ర్తించార‌ని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. బెదిరింపులు, ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేప‌ణ వంటి అభియోగాలు ఆ ఇద్ద‌రిపై బుక్ చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. స్టాక్ మార్కెట్‌లో రాజ్ భారీగా ఇన్వెస్ట్ చేసిన విష‌యాన్ని ఆ ఇద్ద‌రికీ తెలుసు. అత‌నికి మంచి ఉద్యోగం ఉంది. భారీగా జీతం కూడా వ‌స్తోంది. ప్రైవేటు వీడియోను స‌ర్క్యూలేట్ చేస్తాన‌ని బెదిరిస్తూ ఆ ఇద్ద‌రూ రాజ్ మోరేను బ్లాక్‌మెయిల్ చేశారు. కంపెనీకి చెందిన అకౌంట్లలో ఉన్న డ‌బ్బును.. త‌మ‌ ప‌ర్స‌న‌ల్ అకౌంట్ల‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయించారు. రాజ్ వ‌ద్ద నుంచి అత‌ని ల‌గ్జ‌రీ కారును కూడా బ‌ల‌వంతంగా తీసుకెళ్లారు.

సూసైడ్ నోట్‌లో త‌న త‌ల్లికి సారీ చెప్పాడ‌త‌ను. మంచి కొడుక‌గా ఉండ‌లేక‌పోయిన‌ట్లు తెలిపాడు. వ‌చ్చే జ‌న్మ‌లో నా లాంటి కొడుకును నీకు ఇవ్వొద్దు అని ఆ దేవుడిని ప్రార్థిస్తున్న‌ట్లు చెప్పాడు. పూనం ఆంటీ మా అమ్మ‌ను మంచి చూసుకో, వేర్వేరు అకౌంట్ల‌లో పాల‌సీలు ఉన్నాయ‌ని, ఆ డ‌బ్బును అమ్మ‌కు ఇవ్వ‌మ‌ని త‌న నోట్‌లో అత‌ను పేర్కొన్నాడు. త‌న ఆత్మ‌హ‌త్య‌కు రాహుల్ ప‌ర్వాని, సాబా ఖురేషి కార‌ణ‌మ‌న్నాడు. నిందితులు ఇద్ద‌రు సుమారు మూడు కోట్ల వ‌ర‌కు బాధితుడి నుంచి అక్ర‌మ రీతిలో కాజేసిన‌ట్లు పోలీసులు తెలిపారు

Tags:    

Similar News