చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సామ్ ఆల్ట్ మెన్ తన పదవికి రాజీనామా చేశారు. సంస్థను ముందుకు తీసుకుపోవడంలో ఆయనపై విశ్వాసం సన్నగిల్లిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ బోర్డు తెలిపింది. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది.
ఇంటర్నెట్ సంచలనం చాట్ జీపీటీ యాజమాన్య సంస్థ ‘ఒపెన్ ఏఐ’లో సంస్థాగతంగా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. సంస్థ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్, సహ వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రాక్‌మన్‌లను బోర్డు నుంచి తొలగిస్తూ ఒపెన్ ఏఐ హఠాత్ నిర్ణయం తీసుకుంది. దీనిపై సామ్, గ్రెగ్ విస్మయాన్ని, ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే, తమకు భిన్నవర్గాల నుంచి భారీ ఎత్తున లభిస్తున్న మద్దతుపై వారు హర్షం వెలిబుచ్చారు. తనను ఒపెన్ ఏఐ నుంచి తొలగించటంపై సామ్ ఆల్ట్‌మన్ ఎక్స్‌లో స్పందించారు. ‘ఈ రోజు కలిగిన అనుభవం పలు విధాలుగా భిన్నమైనది. ఒక వ్యక్తి బతికి ఉండగానే అతడికి సంతాప సందేశాన్ని చదివి వినిపించినట్లుగా ఉంది. అయితే, నాపై కురుస్తున్న ప్రేమాభిమానాలు మాత్రం ఓదార్పునిస్తున్నాయి’ అని పేర్కొన్నారు. సామ్ ఆల్ట్‌మన్‌ను తొలగించటంపై ఒపెన్ ఏఐ ఒక ప్రకటన చేసింది.
కంపెనీ బోర్డుతో సామ్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపటం లేదని, తద్వారా బోర్డు తన బాధ్యతలను నెరవేర్చటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని తెలిపింది. సామ్ ఆల్ట్‌మన్ స్థానంలో కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మీరా మురాటిని తాత్కాలిక సీఈవోగా నియమిస్తున్నట్లు పేర్కొంది. కృత్రిమ మేధను కొత్తగా పరిచయం చేస్తూ చాట్ జీపీటీను సృష్టించిన 38 ఏళ్ల సామ్ ఆల్ట్‌మన్ టెక్ ప్రపంచం తాజా సంచలనంగా నిలిచారు.
ఓపెన్ ఏఐ (చాట్‌జీపీటీని తయారు చేసిన సంస్థ) నుంచి ఆల్ట్‌మాన్ తొలగింపు నాటకీయంగా జరిగింది. ఆల్ట్‌మాన్ నాయకత్వ సామర్థ్యాలపై తమకు నమ్మకం లేదని బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. కంపెనీతో ఆల్ట్‌మాన్ కమ్యూనికేషన్ స్పష్టంగా లేదని కూడా ఆరోపించింది. కంపెనీ ప్రకటన పరిశీలిస్తే ఆల్ట్‌మాన్‌తో ఏదో జరిగిందని, ఆయన ముఖ్యమైన విషయం చెప్పకుండా దాచారని సూచిస్తోంది. దీనిపై వదంతులు చాలానే వ్యాపిస్తున్నాయి కానీ, వాస్తవం ఏంటనేది తెలియదు.