Chhattisgarh Exit polls: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే.. మళ్లీ అధికారం ఆ పార్టీ దేనా
ఉత్కంఠ రేపుతున్న ఛత్తీస్‌ఘడ్ ఎగ్జిట్ పోల్స్..;
తెలంగాణతో పాటూ మిజోరం, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఎన్నికలు ముగిశాయి. ప్రజలు వెలువరించిన తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. మరోవైపు, ప్రజాతీర్పుపై ఉత్కంఠను మరింత పెంచుతూ ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. వామపక్ష తీవ్రవాద ప్రభావం అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాన పోరు మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్యే నెలకొంది. చత్తీస్‌గఢ్‌లో సంపూర్ణ మెజారిటీతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు అంచనావేశాయి. మొత్తం 90స్థానాలు ఉన్న చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ 49 నుంచి 65 చోట్ల గెలిచి తిరిగి అధికారానికి వస్తుందని టుడేస్ చాణక్య అంచనా వేసింది. భాజపాకు 25 నుంచి 41 స్థానాలు, ఇతరులు 3 చోట్ల విజయం సాధించవచ్చని పేర్కొంది. టైమ్స్‌నౌ-ఈటీజీ ప్రకారం.. కాంగ్రెస్ 46 నుంచి 56 స్థానాలు, భాజపా 30 నుంచి 40 చోట్ల, ఇతరులు 3 నుంచి 5 చోట్ల గెలుస్తారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ 46 నుంచి 55 స్థానాలు,భాజపాకు 35 నుంచి 45 సీట్లు, ఇతరులకు 10 స్థానాలు రావొచ్చని దైనిక్ భాస్కర్ అంచనా కట్టింది.
ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ 41 నుంచి 53 స్థానాలు గెలుస్తుందని తేలింది. భాజపాకు 36 నుంచి 48 స్థానాలు రావొచ్చని ఇతరులు 4 చోట్ల గెలుస్తారని వెల్లడైంది. జన్‌కీబాత్ అంచనా ప్రకారం.. ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ 42 నుంచి 53 స్థానాలు గెలవనుంది. భాజపా 34 నుంచి 45 స్థానాలు గెలిచే అవకాశముంది. ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్... ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ 46 నుంచి 56 స్థానాలు గెలవొచ్చని వెల్లడైంది. భాజపా 30 నుంచి 40 చోట్ల, ఇతరులు 3 నుంచి 5 చోట్ల గెలిచే అవకాశముందని పేర్కొంది. ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ 40నుంచి 50స్థానాలు గెలవచ్చని యాక్సిస్ మైఇండియా...... ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. భాజపాకు 36 నుంచి 46 స్థానాలు, ఇతరులు ఒకటి నుంచి ఐదు స్థానాల్లో గెలవనున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ 54 నుంచి 64 నియోజకవర్గాల్లో గెలుస్తుందని.. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ తెలిపింది. భాజపాకు 29 నుంచి 39 స్థానాలు, ఇతరులకు 2 స్థానాలు.. దక్కవచ్చని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది.
భూపేశ్ భాఘేల్ సారథ్యంలో తమకు గెలుపు తథ్యమని హస్తం పార్టీ భావిస్తుండగా మోదీ మ్యాజిక్‌తో విజయం తమదేనంటూ బీజేపీ ధీమాతో ఉంది. అవనీతి రహిత పాలన అందిస్తామంటూ ఆప్ కూడా తమ వంతు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించింది. అయితే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం బీజేపీ, కాంగ్రెస్ మధ్య సీట్ల విషయంలో స్వల్ప తేడానే ఉండటంతోె ఉత్కంఠ మరింత పెరిగింది. డిసెంబర్ 3న అంచనాలు తారుమారయ్యే ఛాన్స్ కూడా ఉందని విశ్లేషకులు అంచనా వస్తున్నారు.