CJI NV Ramana : ఈ రోజే రిటైర్ కానున్న సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ..

CJI NV Ramana : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిలో ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ నేటితో తన పదవీ కాలాన్ని ముగించుకోబోతున్నారు.

Update: 2022-08-26 06:15 GMT

CJI NV Ramana : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిలో ఉన్న తెలుగు తేజం జస్టిస్ ఎన్వీ రమణ నేటితో తన పదవీ కాలాన్ని ముగించనున్నారు. చివరి రోజు సీజేఐ ఎన్వీ రమణ 5 హై ప్రొఫైల్ కేసుల్లో తీర్పులపై విచారణ చేపట్టారు. ఎన్నికల ఉచిత హామీలు, 2007 గోరఖ్‌పూర్ అల్లర్లు, కర్ణాటక మైనింగ్ కేసు, రాజస్థాన్ మైనింగ్ లీజు సమస్య, దివాలా చట్టం కింద లిక్విడేషన్ ప్రొసీడింగ్స్‌పై నిబంధనలు వంటి కీలక కేసుల‌పై ఛీప్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

చివరి రోజు జస్టిస్ ఎన్వీరమణ చేపట్టిన విచారణలన్నింటినీ ప్రత్యక్ష ప్రసారం చేశారు. కోర్టు విచారణల లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడం ఇదే తొలిసారి. ఉచిత హామీలపై విచారణ జరిపిన ఎన్వీ రమణ కీలక ఆదేశాలు జారీ చేశారు. అఖిలపక్ష సమావేశం నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది. 2013 తీర్పుపై పునఃసమీక్షించాలని ముగ్గురు జడ్జిల బెంచ్‌కు రిఫర్ చేశారు. అలాగే 2007నాటి యోగిఆధిత్యనాథ్‌పై పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు కొట్టి వేసింది.

Tags:    

Similar News