Rekha Gupta Attacked: రేఖా గుప్తాను చెంపదెబ్బ కొట్టిన యువకుడు

నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు;

Update: 2025-08-20 04:15 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం ఉదయం తన నివాసంలో రేఖా గుప్తాను ఒక యువకుడు చెంపదెబ్బ కొట్టాడు. ఈ హఠాత్పరిణామంతో రేఖా గుప్తా సహా అధికారులు షాక్‌కు గురయ్యారు.

రేఖా గుప్తాను చెంపదెబ్బ కొట్టి, జుట్టు లాగడంతో ఆసుపత్రి పాలయ్యారని బీజేపీ నాయకులు తెలిపారు. 30 ఏళ్ల వయసున్న యువకుడు ‘జనసభ’ సందర్భంగా ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి దాడికి పాల్పడ్డాడు. ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై దాడి చేసిన యువకుడిని పట్టుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ముఖ్యమంత్రి నివాసంలో జనసభ జరుగుతుండగా రేఖా గుప్తాపై తొలుత యువకుడు గట్టిగా అరిచాడు. అనంతరం ఆమె చెంపపై కొట్టాడు. అనంతరం దుర్భాషలాడాడు. ముఖ్యమంత్రితో యువకుడు తీవ్ర ఘర్షణకు దిగాడు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది అడ్డుకోకపోవడం పెద్ద భద్రతా లోపంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం ముఖ్యమంత్రి నివాసం దగ్గర భారీగా భద్రతా పెంచారు. ఒక యువకుడు అంత దగ్గరగా ముఖ్యమంత్రి దగ్గరకు ఎలా వెళ్లాడన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. భద్రతా సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నారు.

ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు తొలుత ఒక పత్రాన్ని సమర్పించాడు. వెంటనే ఆమెపై అరవడం ప్రారంభించాడు. ఇంతలోనే చెంపదెబ్బ కొట్టి దుర్భాషలాడాడు. అయితే అతడి వ్యాఖ్యలను బట్టి చూస్తే.. పార్టీ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్న వ్యక్తే ఈ దాడి చేసినట్లుగా ఆ పార్టీ అధికారి ప్రతినిధి ప్రవీణ్ శంకర్ వ్యాఖ్యానించారు. అంటే పార్టీలో అంతర్గత విభేదాలు కారణంగానే ఈ దాడి జరిగి ఉండొచ్చని కాషాయ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News