Delhi : నేటి నుంచి ‘జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగం’ ప్రచారాన్ని ప్రారంభించనున్న కాంగ్రెస్

నేటి నుంచి ఢిల్లీలో మొదలు కానున్నప్రచారం;

Update: 2025-01-03 01:00 GMT

కాంగ్రెస్ పార్టీ జనవరి 3, 2025 నుండి “జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగ” పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఈ ప్రచారం అన్ని నియోజిక వర్గాలు, జిల్లాలు ఇంకా రాష్ట్ర స్థాయిల్లో ప్రారంభమవుతుందని ప్రకటించింది. ఈ ప్రచారం జనవరి 26, 2025న మధ్యప్రదేశ్‌లోని మోవ్ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మస్థలంలో జరిగే బహిరంగ సభతో ముగియనుంది.

డిసెంబర్ 26న కర్ణాటకలోని బెలగావిలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో ఈ కార్యక్రమంపై నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 26న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దృష్ట్యా పార్టీ జనవరి 3కు ఈ ప్రచారాన్ని వాయిదా వేసింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్‌కు గౌరవంగా పార్టీ అన్ని కార్యక్రమాలను వారం రోజుల పాటు నిలిపివేసిందని తెలిపారు. ఈ కార్యక్రమం భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని గుర్తుచేస్తూ, రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడం దీని ప్రధాన లక్ష్యం. ఈ ప్రచారంలో నియోజిక వర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో సదస్సులు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు.

కాంగ్రెస్ ఈ ప్రచారాన్ని 13 నెలల పాటు కొనసాగించనుంది. జనవరి 26, 2025 నుండి జనవరి 26, 2026 వరకు “సేవ్ కాన్‌స్టిట్యూషన్ నేషనల్ పాదయాత్ర” పేరుతో భారీ ప్రచారాన్ని చేపట్టనుంది. అందులో కాంగ్రెస్ నాయకులు మొత్తం ప్రజలతో కలసి రాజ్యాంగ విలువలను పరిరక్షించడానికి కృషి చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రకటన మేరకు, రాహుల్ గాంధీ నేతృత్వంలో “సేవ్ కాన్‌స్టిట్యూషన్ నేషనల్ మార్చ్” జనవరి 3, 2025న ప్రారంభం కానుందని, ఇది “భారత్ జోడో యాత్ర” తరహాలో ఉంటుందని, దేశవ్యాప్తంగా రాజ్యాంగం విలువలను ప్రచారం చేస్తుందని ఆయన తెలిపారు.

Tags:    

Similar News