Constitution Debate: నేడు పార్లమెంటులో రాజ్యాంగంపై చర్చ

లోక్‌సభలో చర్చను ప్రారంభించనున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌;

Update: 2024-12-13 02:00 GMT

భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకుని 75 సంవత్సరాలు అయినా సందర్భంగా పార్లమెంటులోని ఉభయ సభల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చ కొనసాగనుంది. ఈరోజు (డిసెంబర్ 13) లోక్‌సభలో ఉదయం జీరో అవర్ ముగిసిన తర్వాత కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దీనిని స్టార్ట్ చేయనున్నారు. ఇది శనివారం వరకు కొనసాగనుంది.. ఈ చర్చకు ముగింపుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆన్సర్ ఇవ్వనున్నారు. అలాగే, ఈ నెల 16వ తేదీన ప్రత్యేక చర్చను హోంమంత్రి అమిత్‌ షా ఆరంభిచనున్నారు. 17న ప్రధాని మోడీ ముగింపు ప్రసంగం చేయనున్నారు.

అయితే, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగంపై చర్చ జరగాలని కాంగ్రెస్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అధికార ఎన్‌డీఏ, ఇండియా కూటమిల మధ్య ఒప్పందం చేసుకున్నారు. 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగ పరిషత్‌ కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించారు. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది.

మరోవైపు ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’ బిల్లుని ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందని చర్చ నడుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్ కమిటీ ఇచ్చిన సిఫారసుల్ని కేంద్రమంత్రి వర్గం ఆమోదించింది. ఈ రోజు బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏక కాలంలో 100 రోజలు వ్యవధిలో పట్టణ-పంచాయతీ ఎన్నికలతో సహా రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత ఈ బిల్లుని పీఎం మోడీ ప్రశంసించారు. ఇది భారత ప్రజాస్వామ్యాన్ని పెంపొందిచే దిశగా ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు.

Tags:    

Similar News