India Corona : కరోనా పాజిటివిటీ రేటు 4 శాతం

India Corona : గత 4 రోజులుగా 18వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.

Update: 2022-07-09 13:58 GMT

India Corona : దేశంలో కరోనా కేసులు గత 4 రోజుల నుంచి ప్రతీ రోజు 18వేలకు పైగా నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటు 4శాతం ఉంది. ప్రతీ రోజు సుమారు నాలుగున్నర లక్షల మందికి కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. వారిలో 18వేల మందికి పాజిటివ్ వస్తుంది. గడిచిన 24 గంటల్లో 43 మంది మ‌ృతి చెందారు.

దేశంలో ఇప్పటి వరకు 198 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి. ప్రజలు మాస్కులు ధరించడం మళ్లీ తగ్గించేశారు. ప్రజాప్రథినిధులు, అధికారంలో ఉన్నవారు కూడా బహిరంగ సమావేశాల్లో మాస్కులు ధరించడం లేదు. కొందరు ముందు జాగ్రత్తగా కోవిడ్ నిబంధనలను ఇంకా పాటిస్తూనే ఉన్నారు. ఆఫ్రికాలోని ఘనా దేశంలో మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. ఈ వైరస్ ప్రాణాంతకమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రపంచ దేశాలను హెచ్చరించింది. కరోనా కేసులు తగ్గినా కోవిడ్ నిబంధనలు పాటిస్తే వైరస్‌ల బారి నుంచి సులువుగా తప్పించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

Tags:    

Similar News