కోవిన్ డేటా లీక్ వ్యవహారంలో యువకుడి అరెస్ట్

కోవిన్ డేటా లీక్ వ్యవహారంలో యువకుడి అరెస్ట్;

Update: 2023-06-22 07:30 GMT

కోవిన్ పోర్టల్ లోని సమాచారం లీక్ అయిందంటూ ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో ఒక వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోర్టల్ కోవిన్. ఇందులో సున్నితమైన సమాచారం లీక్ అయిందంటూ ఇటీవల వచ్చిన వార్తలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అలాంటిదేం లేదంటూ తిప్పి కొట్టిన కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా బీహార్ కు చెందిన ఒక వ్యక్తిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తి సోషల్ మీడియాలో ప్రముఖులు ఉన్నతాధికారులకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతని తల్లి ఆరోగ్య కార్యకర్త కావడంతో ఆమె నుంచి సమాచారం సంపాదించినట్లుగా తెలుస్తోంది. ఆమెను కూడా పోలీసులు విచారిస్తున్నారు.

కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం CoWIN పోర్టల్‌లో సైన్ అప్ చేసిన వారు, వారి ఆధార్, పాస్‌పోర్ట్ నంబర్‌లతో సహా భారతీయ పౌరుల సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని పొందుపరచారు. అయితే ఇందులోని సమాచారం అంతా టెలిగ్రామ్ లో కనిపించడం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ డేటా ఉల్లంఘనతో భారతీయ పౌరుల ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాస్‌పోర్ట్ నంబర్లు టెలిగ్రామ్‌లో అందరికీ కనపడుతున్నాయి. టీకా మోతాదులు ఆర్యోగ్య కేంద్రాలలో అందుబాటులో ఉన్నప్పుడు వ్యక్తులు ఒకే మొబైల్ నంబర్‌తో ఇంట్లో ఉన్న ఇతర కుటుంబ సభ్యుల కోసం స్లాట్‌లను బుక్ చేసుకునేవారు. ఒకే మొబైల్ నంబర్‌తో చాలా మంది వాక్సిన్ కోసం చేసుకున్నట్లయితే టెలిగ్రామ్ బాట్ వారందరి వివరాలను ఒకేసారి చూపించింది. అయితే ఓటీపీ తో మాత్రమే పోర్టల్ లో డేటాను చూడగలమని, దాన్నుంచి డేటా లీక్ అయ్యే అవకాశం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయినా సరే ఈ డేటా లీకేజీ వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే బీహార్ కు చెందిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు

Tags:    

Similar News