Delhi CM Rekha Gupta : అడ్డంగా ఆవులు.. కారు దిగిన సీఎం!

Update: 2025-03-27 10:15 GMT

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు షాకింగ్ ఇన్సిడెంట్ ఎదురైంది. సీఎం కాన్వాయ్ ఒక ఫ్లై ఓవర్ మీద వెళుతున్నారు. ఆమె కాన్వాయ్ స్పీడ్ గా పరుగులు పెడుతోంది. ఇంతలో ఆవుల గుంపు రోడ్డుకి అడ్డంగా వచ్చింది. కాన్వాయ్ లోని కార్లు ఒక్కసారిగా బ్రేక్ వేశాయి. సీఎం తన కారు దిగారు. అవి ఎక్కడినుంచి వచ్చాయన్నది వాకబు చేశారు. షెల్టర్ లేని ఆవులు అని తెలుసుకున్నారు. వాటికి ఒక నీడ కల్పించాల్సిన అవసరం ఉందని అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయాలని అక్కడికక్కడే ఆదేశించారు. మొత్తం మీద ఆ ఆవులతో ఆమె కాన్వాయ్ పావుగంటకు పైగా రోడ్డు మీద నిలిచిపోయింది. ఆలనా పాలనా లేని ఇలాంటి జంతువులు పునరావాసానికి ఏర్పాట్లు చేయాల్సి ఉందని ఆమె అన్నారు.

Tags:    

Similar News